ఆటలలో గెలుపోటములు సహజం... కానీ ఇలాంటి పాత పాటలను సరదాగా పాడుకుంటూ ఆడుకునే ఆనందం మాత్రం వర్ణించలేనిది! అభిజీత్ బావ మ్యాథ్స్ ప్రాబబిలిటీస్ ఫెయిల్ అయినా, మన తెలుగిల్లు సరదా మాత్రం పాస్ అయిపోయింది. తర్వాతి 'పాటల పల్లకి' సెషన్ లో మళ్ళీ కలుద్దాం!
తెలుగిల్లు పాటల పల్లకి
అయ్యయ్యో... చేతిలో డబ్బులు పోయెనే!
తెలుగిల్లు పేకాట ముచ్చట్లు - పృథ్వీ, వరుణ్, అభిజీత్, సూర్య
చిత్రం: కులగోత్రాలు (1962)
సాహిత్యం: కొసరాజు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
నేపధ్య గానం: పిఠాపురం, మాధవపెద్ది సత్యం
(సమయం: ఆదివారం మధ్యాహ్నం. ప్రదేశం: తెలుగిల్లు పెరట్లో ఉన్న ఒక పెద్ద చెట్టు కింద టేబుల్. పృథ్వీ, వరుణ్, అభిజీత్, సూర్య నలుగురూ రమ్మీ ఆడుతున్నారు. అభిజీత్ తన లెక్కలన్నీ ఫెయిల్ అయ్యి, వరుసగా మూడో గేమ్ కూడా ఓడిపోయాడు.)
అభిజీత్: (తన కార్డ్స్ టేబుల్ మీద పడేస్తూ, ఫ్రస్ట్రేషన్ తో సరదాగా తల పట్టుకుని)... "అయ్యయ్యో... చేతిలో డబ్బులు పోయెనే!"
సూర్య: (వెంటనే అందుకుని, టేబుల్ మీద దరువు వేస్తూ) "అయయ్యో... జేబులు ఖాళీ ఆయెనే!"
వరుణ్: (నవ్వుతూ) "ఉన్నది కాస్తా ఊడింది... సర్వ మంగళం పాడింది!"
పృథ్వీ: (కార్డ్స్ కలుపుతూ) "ఒరేయ్ అభిజీత్... నువ్వేమో యూనివర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్ వి! రమ్మీలో ఏ కార్డ్ వచ్చే ప్రోబబిలిటీ (Probability) ఎంత ఉందో పెర్ముటేషన్స్, కాంబినేషన్స్ అన్నీ పక్కాగా లెక్కలేసి ఆడావు. అయినా ఓడిపోయావ్ ఏంట్రా?"
అభిజీత్: "అదే కదా పృథ్వీ బావా నా ప్రాబ్లమ్! మ్యాథ్స్ అంటే పక్కా లాజిక్, ఇక్కడేమో మీ ముగ్గురూ లాజిక్ లేకుండా బ్లఫ్ చేస్తున్నారు. నా ఈక్వేషన్స్ అన్నీ రివర్స్ అయ్యాయి. అయినా, మన కొసరాజు గారు అప్పట్లోనే ఏమని రాశారు..."
"ఆ మహా మహా నలమహారాజుకే... తప్పలేదు భాయీ
ఓటమి తప్పలేదు భాయీ!"
అభిజీత్: "ఆ మహా రాజులే ఓడిపోయారు, నేనెంత?"
వరుణ్: "నేను లాయర్ గా చెబుతున్నా విను అభిజీత్... వాళ్ళకి అప్పట్లో ఏ కోర్టులూ లేవు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నువ్వు పల్లవికి దొరికితే మాత్రం..."
"పెళ్లాం మెళ్లో నగలతో సహా... తిరుక్షవరమై పోయింది!"
వరుణ్: "అని పాడకముందే ఆపేయ్ గేమ్. 'మరి నువు చెప్పలేదు భాయీ... అది నా తప్పుగాదు భాయీ' అని మేమెవరమూ సాక్ష్యం చెప్పలేము ముందే చెబుతున్నా."
సూర్య: "నిజమే బావా! అసలు ఈ పాటలో పిఠాపురం గారు, మాధవపెద్ది సత్యం గారు పాడుకున్న తీరు భలే ఉంటుంది కదా! ఒకరు ఏడుస్తుంటే, ఇంకొకరు ఎటకారం చేయడం. 'తెలివి తక్కువగ... చీట్ల పేకలో దెబ్బ తింటివోయీ... బాబూ నిబ్బరించవోయీ' అంటూ ఆ సెటైర్ నీకు పర్ఫెక్ట్ గా సెట్ అయింది అభిజీత్ బావా."
పృథ్వీ: "అందుకే కొసరాజు గారు రెండో చరణంలో భలే ప్రాక్టికల్ అడ్వైస్ ఇచ్చారురా. 'నిలువు దోపిడీ దేవుడికిచ్చిన ఫలితం దక్కేది... ఎంతో పుణ్యం దక్కేది... చక్కెర పొంగలి చిక్కేది'. ఇక్కడ డబ్బులు పోతే కనీసం ప్రసాదం కూడా రాదు."
వరుణ్: "లేదా కొసరాజు గారు చెప్పినట్టు 'ఎలక్షన్లలో ఖర్చుపెడితే... ఎం.ఎల్.ఏ దక్కేది'. ఈ పేకాటలో ఏముంది?"
అభిజీత్: (ప్రొఫెసర్ లాగా సీరియస్ లుక్ ఇస్తూ, మళ్ళీ కార్డ్స్ అందుకుంటూ) "ఛా... మీరు భలే భయపడతారు. జూదగాడి మైండ్ సెట్ ని పర్ఫెక్ట్ గా చెప్పిన మూడో చరణం మర్చిపోయారా? నా నెక్స్ట్ ప్రాబబిలిటీ క్యాలిక్యులేషన్స్ వినండి..."
"గెలుపూ ఓటమి దైవాధీనం... చెయ్యి తిరగవచ్చు... మళ్ళీ ఆడి గెల్వవచ్చు!
సూర్య: (నవ్వు ఆపుకోలేక) "బావకి మళ్ళీ పిచ్చి లేచింది... కంటిన్యూ... 'ఇంకా పెట్టుబడెవడిచ్చు... ఇల్లు కుదవ చేర్చవచ్చు... ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో... మన కరువు తీరవచ్చు'."
పృథ్వీ: "పోతే... అనుభవమ్ము వచ్చు!"
అందరూ కలిసి: (టేబుల్ మీద చరుస్తూ, గట్టిగా పాడుతూ) "చివరకు జోలె కట్టవచ్చు!!" (గట్టిగా నవ్వుతారు)
వరుణ్: "సరే సరే, ఈ జోలె కట్టే ప్రోగ్రాం పక్కన పెట్టి, లోపలికెళ్లి ఆ జాహ్నవి, పల్లవిలు చేసిన స్నాక్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం పదండి."