కొన్నిసార్లు ఒకరు మాట్లాడటం నేర్చుకోవాలి... మరొకరు వినటం మాత్రమే కాదు, చేసి చూపటం కూడా నేర్చుకోవాలి.
ఆ రోజు ఉదయం నుంచే శృతికి కొంచెం tension. సాయంత్రం ఒక important online meeting ఉంది. అందుకే ఉదయాన్నే సూర్యకి పిల్లల homework, dinner గురించి చెప్పింది.
“నువ్వు meeting మీద concentrate చెయ్యి. Jai, Manvi, dinner అన్నీ నేను చూసుకుంటాను,” అని సూర్య చాలా confidently చెప్పాడు.
శృతి కూడా అదే నమ్ముకుని తన రోజు plan చేసుకుంది. కానీ సాయంత్రం దగ్గరపడే సరికి సూర్య officeలో unexpected client issueలో ఇరుక్కుపోయాడు. Meeting మొదలయ్యే సమయానికి అతను ఇంకా ఇంటికి రాలేదు. ఒకవైపు laptop ముందు discussion జరుగుతుంటే, మరోవైపు Manvi ఏదో కావాలని వచ్చేది. Jai homework book తీసుకుని నిలబడేవాడు. Kitchenలో dinner ఇంకా half done.
సూర్య:
“శృతి… sorry. Last minute client issue వచ్చింది. నిజంగా రావాలనే అనుకున్నాను,” అన్నాడు.
శృతి:
“Hmm… సరే,” అంది.
సూర్య:
“Upset అయ్యావా?”
శృతి:
“లేదు. ఇప్పుడు మాట్లాడే mood లేదు సూర్య. అంతే.”
అక్కడితో మాట ఆగిపోయింది. సూర్య కూడా ఇంకేమీ అడగలేదు. కానీ మరుసటి రోజు శృతి normalగానే మాట్లాడినా, తన usual warmth మాత్రం కనిపించలేదు. సూర్యకి అదే ఎక్కువగా confuse చేసింది.
1
2
3
భాగం 1: వరండాలో తాతయ్యతో
సాయంత్రం verandaలో అనంత్ తాతయ్య plantsకి నీళ్లు పోస్తున్నాడు. శృతి రెండు cups tea తీసుకుని వచ్చింది.
శృతి:
“మామయ్య… tea.”
అనంత్ తాతయ్య:
కప్పు తీసుకుని ఒక సిప్ చేశాడు. కాసేపు ఆలోచించి, “పంచదార వేసావా అమ్మా?” అన్నాడు.
శృతి ఒక్కసారిగా ఆగింది. తన చేతిలో ఉన్న cupని చూసి చిన్నగా sip చేసింది.
శృతి:
“అయ్యో… అవును మామయ్య. నా cupలో కూడా వేయలేదు. పూర్తిగా మర్చిపోయాను.”
అనంత్ తాతయ్య:
నవ్వుతూ, “రెండు రోజులుగా ఇంకేదో కూడా మర్చిపోయినట్టున్నావు,” అన్నాడు.
శృతి:
“ఏంటి?”
అనంత్ తాతయ్య:
“నవ్వడం.”
శృతి నవ్వకుండా ఉండలేకపోయింది. కాసేపటికి అనంత్ తాతయ్య tone కొంచెం soft అయింది.
అనంత్ తాతయ్య:
“సూర్యతో ఏమైనా?”
శృతి:
“మొన్న నా meeting ఉందని తెలుసు. పిల్లల్ని చూసుకుంటానన్నాడు. ఆలస్యంగా వచ్చాడు. . నేను అతన్ని నమ్ముకుని పని plan చేసుకున్నాను. ముందే ఒక message చేసి ఉంటే prepare అయ్యేదాన్ని.”
అనంత్ తాతయ్య:
ప్రశాంతంగా విన్నాడు. “ఇది సూర్యకి చెప్పావా?”
శృతి:
“లేదు… అది అతనికి తెలియాలి కదా ”
అనంత్ తాతయ్య:
చిన్నగా నవ్వాడు. “అదిగో. Marriageలో చాలా చిన్న problems ఆ ‘తెలియాలి కదా’ దగ్గరే మొదలవుతాయి. నువ్వు ‘ఏమీ లేదు’ అంటే నీకు దాని అర్థం ‘ఏదో ఉంది, అర్థం చేసుకో.’సూర్యకి మాత్రం నిజంగానే ఏమీ లేదు. ఇద్దరూ correct. ఇద్దరూ unhappy.”
అనంత్ తాతయ్య:
“అందుకే కొన్ని విషయాలు చెప్పాలి అమ్మా... మనసులో ఉన్నది share చేయడం అంటే complaint చేయడం కాదు. ఎవరి పద్ధతిలో వాళ్లు. ఒక book ఉంది. Men Are from Mars, Women Are from Venus. ఎప్పుడైనా చదివావా? Libraryలో ఉంది. తీసుకెళ్ళు.”
భాగం 2: వంటింట్లో అమ్మమ్మతో
అదే సమయంలో kitchenలో మరో conversation నడుస్తోంది. శ్రీ అమ్మమ్మ దోశలకి పిండి కలుపుతుంటే సూర్య counter దగ్గర నిలబడి ఉన్నాడు.
సూర్య:
“అమ్మ… శృతి ఇంకా upsetగానే ఉంది. నేను sorry కూడా చెప్పాను.
శ్రీ అమ్మమ్మ:
అతని వైపు చూసింది. “నువ్వు చిన్నప్పుడు hallలో ballతో window glass పగలగొట్టావు గుర్తుందా? Sorry అన్నావు. నేను ఏమన్నాను?”
సూర్య:
“చీపురు తీసుకురా అన్నారు.”
శ్రీ అమ్మమ్మ:
“అదే. Sorry చెప్పగానే విరిగి పడిన glass ముక్కలు వాటంతట అవే మాయం అయిపోవు కదా . శృతికి నీ apology అవసరం లేదని కాదు. Words important. కానీ next time అదే situation వచ్చినప్పుడు నీ action ఏంటి? అదే ఆమె చూస్తుంది.”
సూర్య:
“ఆమె కూడా ఏమీ చెప్పడం లేదు.”
శ్రీ అమ్మమ్మ:
“అందుకే అడుగు... ‘ఎందుకు ఇంకా upsetగా ఉన్నావు?’ అని కాదు. ‘ఆ రోజు నీకు ఏది ఎక్కువగా hurt చేసింది?’ అని అడుగు. ముందు answer విను. నీ explanation తర్వాత చెప్పు. మాటకి action కనిపిస్తేనే దానికి weight పెరుగుతుంది.”
శ్రీ అమ్మమ్మ:
“Libraryలో Men Are from Mars, Women Are from Venus ఉంది. చదువు. మనం ప్రేమించే వాళ్లు మనలాగే think చేయాల్సిన అవసరం లేదు. ఎవరి పద్ధతిలో వాళ్లు. వాళ్ల పద్ధతి కొంచెం అర్థం చేసుకుంటే మన పద్ధతి కూడా వాళ్లకి explain చేయడం easy అవుతుంది.”
భాగం 3: ఆ రాత్రి సర్దుబాటు
ఆ రాత్రి శృతి laptop close చేస్తుండగా సూర్య ఆమె ఎదురుగా కూర్చున్నాడు.
సూర్య:
“శృతి… ఈసారి explanation ఇవ్వడానికి కాదు. ఒకటి తెలుసుకోవడానికి. ఆ రోజు నీకు నిజంగా ఏది ఎక్కువగా hurt చేసింది?”
శృతి:
“నువ్వు ఆలస్యంగా వచ్చావు అని కాదు సూర్య. ఒక్కసారిగా నేను అన్నీ వంటరిగా manage చేస్తున్నట్టనిపించింది. నువ్వు ముందే ఒక message చేసి ఉంటే నేను prepare అయ్యేదాన్ని.”
సూర్య:
“Okay... నువ్వు నా మీద depend అయ్యావన్నది నేను చూడలేదు. అది ఇప్పుడు అర్థమైంది. Next Thursday నీ presentation ఉంది కదా? Calendar block చేసుకున్నాను. Kids, dinner నా responsibility. ఏదైనా change అయితే ముందే call చేస్తాను.”
శృతి ముఖంలో మొదటిసారి ఆ రెండు రోజుల tension కొంచెం తగ్గింది.
శృతి:
“That is all I wanted.”
కొద్దిసేపటికి సూర్యకి ఏదో గుర్తొచ్చింది.
సూర్య:
“By the way… అమ్మ నాకు ఒక book చదవమని చెప్పింది . Men Are from Mars, Women Are from Venus.”
శృతి:
ఒక్కసారిగా నవ్వేసింది. “మామయ్య నాకు కూడా అదే చెప్పారు!”
సూర్య:
“అంటే వాళ్లిద్దరూ మనల్ని separately పట్టుకుని same homework ఇచ్చారా? మన ఇంట్లో privacy అనే concept theoryలో మాత్రమే ఉందనుకుంటా.”
శృతి నవ్వింది. సూర్య అక్కడినుంచి వెళ్లబోతూ మళ్లీ ఆగాడు.
సూర్య:
“Next time నేను అర్థం చేసుకోవాలి అనుకున్నా కూడా… నువ్వు చెప్పు.”
శృతి:
“Next time నువ్వు sorry చెప్పాక… దాని తర్వాత ఏం చేయాలో కూడా ఆలోచించు.”
సూర్య:
“Deal.”
కొన్ని సమస్యలు పెద్ద explanationsతో clear కావు.
కొన్నిసార్లు ఒకరు మాట్లాడటం నేర్చుకోవాలి.
మరొకరు వినటం మాత్రమే కాదు, చేసి చూపటం కూడా నేర్చుకోవాలి.
మిగతాది? ఎవరి పద్ధతిలో వాళ్లు.
కలిసి ఉన్నప్పుడు మాత్రం… కొంచెం ఒకరి పద్ధతి ఇంకొకరు నేర్చుకుంటూ ఉండాలి.