మనసు పొరల్లోంచి • పల్లవి డైరీ
ఎప్పుడో ఒకరోజు…
రేపు ఉందనే confidence. కానీ ‘ఎప్పుడో ఒకరోజు’కి calendarలో date ఉండదు.
1
2
3
భాగం 1: దాచుకున్న జ్ఞాపకం
ప్రుధ్వి కాలేజీ రోజుల స్నేహితుడు మాధవ్. కొద్ది రోజుల క్రితం మాధవ్ వాళ్ల అమ్మగారు చనిపోయారు. పరామర్శించడానికి ఒక సాయంత్రం ప్రుధ్వి వాళ్లింటికి వెళ్లాడు.
ప్రుధ్వి:
“ఆంటీ గురించి తెలిసి చాలా బాధేసింది రా… ఎలా ఉన్నావు?”
మాధవ్:
“ఏదో ఉన్నాను. ఇల్లు మాత్రం చాలా ఖాళీగా అనిపిస్తోంది.”
ప్రుధ్వి:
“అంకుల్?”
మాధవ్:
“ఆయన ఇంకా adjust అవ్వలేకపోతున్నారు.”
కొద్దిసేపటి తర్వాత…
మాధవ్:
“నిన్న అమ్మ cupboard సర్దుతుంటే ఒక perfume bottle దొరికింది.”
ప్రుధ్వి:
“హ్మ్?”
మాధవ్:
“Seventeen years క్రితం కొన్నది. ఒక్కసారి కూడా open చేయలేదు.”
ప్రుధ్వి:
“అంతకాలమా? ఎందుకు?”
మాధవ్:
“అడిగినప్పుడల్లా… ‘ఏదైనా special occasionకి వేసుకుంటాను’ అనేది.”
ప్రుధ్వి:
“…”
మాధవ్:
“అది ఒక్కటే కాదు రా. మంచి plates ఉన్నాయి. ‘Guests వచ్చినప్పుడు’ అని ఎప్పుడూ బయటకు తీయలేదు. ఒక dress tag కూడా తీయకుండా అలాగే ఉంది.”
ప్రుధ్వి:
“అన్నీ దాచేశారా?”
“అమ్మకు ఒక favourite dialogue ఉండేది…
‘అన్నీ settle అయ్యాక చూద్దాం.’”
‘అన్నీ settle అయ్యాక చూద్దాం.’”
ప్రుధ్వి:
“మన ఇళ్లలో చాలా common dialogue అది.”
మాధవ్:
“అదే problem. అన్నీ ఎప్పుడూ settle కాలేదు.”
భాగం 2: వాయిదా పడిన ప్రయాణం
ప్రుధ్వి మౌనంగా వింటున్నాడు.
మాధవ్:
“ఒక bill అయిపోయేది. ఇంకో responsibility వచ్చేది. ఎవరికో help కావాలి. ఇంట్లో ఏదో repair. ఇలా years వెళ్లిపోయాయి.”
ప్రుధ్వి:
“మీ parents ఒక trip గురించి కూడా అనుకునేవాళ్లు కదా?”
మాధవ్:
“అవును. Years నుంచి. ప్రతి సంవత్సరం ‘next year తప్పకుండా’ అనేవాళ్లు.”
చిన్న నిశ్శబ్దం.
మాధవ్:
“తర్వాత అమ్మకి health problem వచ్చింది.”
ప్రుధ్వి:
“హ్మ్…”
మాధవ్:
“మనం prepare అయ్యేంత slowగా కూడా రాలేదు రా. కొన్ని నెలల్లో ‘ఎప్పుడైనా వెళ్దాం’ అన్న మాటలు hospital appointmentsగా మారిపోయాయి.”
ప్రుధ్వి ఏమీ మాట్లాడలేదు.
మాధవ్:
“ఒకరోజు hospitalలో అమ్మని అడిగాను… ‘ఏదైనా differently చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుందా?’ అని.”
ప్రుధ్వి:
“ఏమన్నారు?”
మాధవ్:
“ఏదో పెద్ద విషయం చెప్తుందనుకున్నాను.” కొద్దిసేపు ఆగాడు. “‘మీ నాన్నతో ఆ tripకి వెళ్లి ఉండాల్సింది’ అంది.”
ప్రుధ్వి:
“…”
మాధవ్:
“అమ్మ పోయాక ఆ perfume bottle నాన్న చేతిలో పెట్టాను. చాలా సేపు చూస్తూ ఉండిపోయారు.”
ప్రుధ్వి:
“ఏమన్నారు?”
“నలభై ఏళ్లు బాగా జీవించడానికి prepare అవుతూనే ఉన్నాం…
మధ్యలో జీవించడమే మర్చిపోయాం.”
మధ్యలో జీవించడమే మర్చిపోయాం.”
భాగం 3: క్యాలెండర్‌లో లేని రోజు
ప్రుధ్వి మౌనంగా విన్నాడు.
మాధవ్:
“మూడు నెలల తర్వాత ఆ trip నాన్న book చేశారు.”
ప్రుధ్వి:
“ఒక్కరే?”
మాధవ్:
“హ్మ్. అమ్మ photo walletలో పెట్టుకుని వెళ్లారు.”
ప్రుధ్వి:
“…”
మాధవ్:
“మొదటి రోజు సముద్రం దగ్గర నుంచి call చేశారు.”
ప్రుధ్వి:
“ఏమన్నారు?”
మాధవ్:
“‘మీ అమ్మ ఇది చూసి ఉండాల్సింది రా…’ అంతే.”
కొద్దిసేపు ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. తర్వాత మాధవ్ చిన్నగా అన్నాడు.
మాధవ్:
“ప్రుధ్వి… మనం మంచి వాటిని ఎప్పుడూ ‘తర్వాత’ కోసం దాచుకుంటాం కదా.”
ప్రుధ్వి:
“హ్మ్.”
మాధవ్:
“మంచి చీర… మంచి dinner set… ఒక trip… ఒక phone call… ఎవరికైనా చెప్పాల్సిన ఒక మాట…”
ప్రుధ్వి:
“ఎందుకంటే రేపు ఉందనే confidence.”
“అవును. కానీ ‘ఎప్పుడో ఒకరోజు’కి calendarలో date ఉండదు.”
ఇంటికి తిరిగి వస్తూ ప్రుధ్వి చాలా సేపు అదే మాట గురించి ఆలోచిస్తూ ఉన్నాడు.
“ఇంటికి వెళ్లాక అమ్మానాన్నలను అడగాలి…
వాళ్లు కూడా ‘తర్వాత’ కోసం దాచుకున్న list ఏమైనా ఉందేమో.”