Gen -Z విడ్డురాలు

పెళ్ళి మండపంలో “బ్రో” బాంబ్

నువ్వు ఇప్పుడు నా husband కదా బ్రో!

హాల్ లో నవ్వుకుంటున్న కుటుంబం
సాయంత్రం.

తెలుగిల్లు లోగిలిలో శ్రీ అమ్మమ్మ , అనంత్ తాతయ్య , పృథ్వి , అను , ఆకాష్ , పల్లవి , అభిజీత్ అందరూ ఏదో మాట్లాడుకుంటూ కూర్చున్నారు.

Door తెరుచుకుంది. మేధ లోపలికి వచ్చింది. చేతిలో wedding return gift bag. చెప్పులు తీస్తూనే నవ్వడం మొదలుపెట్టింది. మొదట చిన్నగా. తర్వాత పెద్దగా. ఆ తర్వాత sofa మీద కూర్చుని literally పొట్ట పట్టుకుని నవ్వుతోంది.

అను :
“ఏంటి మేధ ? పెళ్ళికి వెళ్లావా? Comedy showకి వెళ్లావా?”
మేధ మాట్లాడటానికి ప్రయత్నించింది.
మేధ :
“అమ్మా … ఒక్క నిమిషం… నేను… నేను…” మళ్ళీ నవ్వు.
పృథ్వి :
“పెళ్ళి జరిగిందా?”
మేధ :
“జరిగింది నాన్నా… అదే problem!” 😂
ఆకాష్ :
“ఏంటి? పెళ్ళికొడుకు పారిపోయాడా?”
మేధ :
“లేదు.”
పల్లవి :
“పెళ్ళికూతురు పారిపోయిందా?”
మేధ :
“లేదు.”
అభిజీత్ :
“అయితే పురోహితుడు పారిపోయాడా? ”
మేధ ఇంకోసారి నవ్వింది.
శ్రీ అమ్మమ్మ :
“అసలు విషయం చెప్పవే. ఇలా suspenseలో పెడితే ఎలా?”
మేధ :
కాస్త control చేసుకుని, “నా friend పెళ్ళి కదా…”
అను :
“అవును.”
మేధ :
“పెళ్ళి అయిపోయింది. మంగళసూత్రం కట్టేశాడు. ఇద్దరూ stage మీద పక్కపక్కన కూర్చున్నారు.”
ఆకాష్ :
Okay…”
మేధ పెళ్ళికూతురులా చేతులు దగ్గర పెట్టుకుని, overexcited expression పెట్టి, నా friend పెళ్ళికొడుకు వైపు తిరిగి… బ్రోఓఓఓఓ!’ అంది!”
Hall మొత్తం silence.
మేధ :
“పెళ్ళికొడుకు చాలా ప్రేమగా చూస్తూ. ‘ఏమైంది బంగారం?’ అన్నాడు. అప్పుడు పెళ్ళికూతురు ఏమందో తెలుసా?”
మేధ :
మళ్ళీ పెళ్ళికూతురు voiceలో: ‘నువ్వు ఇప్పుడు నా husband కదా బ్రో!’”
ఆకాష్ :
NOOOOO!” అంటూ sofa మీద వెనక్కి పడిపోయాడు.
పృథ్వి :
husband categoryలో కొత్త subcategory ఏమైనా వచ్చిందా?”
అభిజీత్ :
“అదే కద మరీ! Brother-zoned husband.”
పల్లవి :
“అభి!!” 😂
అభిజీత్ :
Technically అదే జరుగుతోంది.”
మేధ కొనసాగించింది.
మేధ :
“పెళ్ళికొడుకు face చూడాలి! ఒక secondకి అతను జీవిత నిర్ణయాలన్నీ reconsider చేశాడు.” మేధ పెళ్ళికొడుకులా expression పెట్టి.... “‘ఏమన్నావ్?’”
మేధ :
మళ్ళీ పెళ్ళికూతురులా: “‘Bro! నా life partner bro!’”
శ్రీ అమ్మమ్మ :
“అయ్యో పాపం అబ్బాయి.” 😂
అనంత్ తాతయ్య :
Life partnerని ‘bro’ అంటారా ఇప్పుడు?”
ఆకాష్ :
Gen Zలో bro అనేది relationship కాదు తాతయ్య. punctuation.”
అభిజీత్ :
Excellent. Comma, full stop, bro.”
మేధ :
Exactly!” ఆమె పెళ్ళికొడుకు dialogue reenact చేస్తూ....‘పెళ్ళి అయ్యింది మనిద్దరికే కదా? లేక నన్ను friend-zone చేసి పెళ్ళి చేసుకున్నావా?’”
పల్లవి :
గట్టిగా నవ్వి, “మంచి ప్రశ్న!”
పృథ్వి :
Wedding certificate verify చేసుకోవాల్సిందే.”
మేధ :
“పెళ్ళికూతురు మాత్రం full chill.” మళ్ళీ పెళ్ళికూతురు tone: “‘అయ్యో bro… అంత feel అవ్వకు bro!’పెళ్ళికొడుకు అక్కడే mentally collapse.”
అందరూ నవ్వారు.
మేధ :
“అప్పుడు వాడు ఏమన్నాడంటే…” మేధ dramaticగా లేచి నిలబడి, “‘ఇంకోసారి bro అన్నావంటే… మంగళసూత్రం తీసి friendship band కడతా!’”
Hallలో ఒక్కసారిగా పెద్ద నవ్వు.
పల్లవి :
“పాపం. పెళ్లైన ఐదు నిమిషాల్లోనే promotion నుంచి demotion.”
అభిజీత్ :
Actually designation confusion.”
పృథ్వి :
From husband to bestie.”
ఆకాష్ :
Benefits same ఉంటాయా?”
అను వెంటనే అతని వైపు చూసింది.
అను :
“ఆకాష్ !!.”
ఆకాష్ :
“నేను HR perspectiveలో అడిగాను అమ్మా .” 😇
అందరూ మళ్ళీ నవ్వారు.
మేధ :
మళ్ళీ పెళ్ళికూతురులా innocent face పెట్టి, చిన్నగా చేతులు జోడించి,
‘సరే bro… sorry bro…’ అంది.”
అభిజీత్ :
“ఇది apologyనా? లేక third attackనా?”
పల్లవి :
నవ్వుతూ... “Emotional damage.”
మేధ :
నవ్వు ఆపుకోలేక sofa మీద కూర్చుని, “పెళ్ళికొడుకు expression మాత్రం… priceless. వాడి mindలో ఒక్కటే… భార్యని పెళ్ళి చేసుకున్నాననుకున్నాను… lifetime bro subscription వచ్చింది!’”
అందరూ పడి పడి నవ్వారు. కొద్దిసేపటి తర్వాత శ్రీ అమ్మమ్మ మేధ ని చూసింది.
శ్రీ అమ్మమ్మ :
“అయితే ఆ అమ్మాయి నిజంగా అతన్ని ఎప్పుడూ bro అంటుందా?”
మేధ :
“అవును నానమ్మ.”
శ్రీ అమ్మమ్మ :
thoughtfulగా తల ఊపుతూ, “మా రోజుల్లో భర్త పేరు కూడా పలికేవాళ్లు కాదు.”
ఆకాష్ :
వెంటనే “ఇప్పుడు పేరు పలకరు నానమ్మ... Bro అంటారు.”
శ్రీ అమ్మమ్మ :
cushion తీసుకుని అతనిపై విసురుతూ, “పోరా!” 😂 “ఈ కాలం పిల్లలతో మాట్లాడాలంటే dictionary కాదు… courage కావాలి.”
మళ్ళీ hall మొత్తం నవ్వులతో నిండిపోయింది. 😂

మేధ తన phone తీసుకుని friendకి message type చేసింది:

Bro… నీ పెళ్ళి మా ఇంట్లో evening entertainment అయిపోయింది.”

అక్కడి నుంచి వెంటనే reply:

Thanks bro ❤️”

మేధ screen చూసింది.

ఒక్క క్షణం blank.