టమోటా చారు
Tomato Chaaru
ఒక గిన్నెలో పుల్లని, కమ్మని ఓదార్పు.
Comfort in a bowl with a tangy twist.
తెలుగు ఇళ్లలో టమోటా చారు ఒక సంప్రదాయ వంటకం. వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. జీర్ణక్రియకు మేలు చేసే ఈ చారు లేనిదే మా అమ్మమ్మ భోజనం పూర్తి చేసేది కాదు.
A traditional staple in Telugu households, Tomato Chaaru is a soul-warming thin soup often served with hot rice and ghee. My grandmother used to say a meal isn’t complete without a bowl of this aromatic broth to aid digestion.
తయారి సమయం
10 minutes
10 minutes
వండే సమయం
20 minutes
20 minutes
పరిమాణం
4
4
కష్టం
Easy
Easy
కావలసిన పదార్ధాలు
- టమోటాలు Tomatoes (ripe and chopped) 4 large
- చింతపండు Tamarind (soaked in water) 1 small lemon size
- పసుపు Turmeric powder 1/4 teaspoon
- ఉప్పు Salt(as per taste) 1 teaspoon
- బెల్లం Jaggery (optional for balance) 1 teaspoon
- నీళ్లు Water 3 cups
- కొత్తిమీర Coriander leaves (chopped) 1 handful
- నూనె Cooking Oil 1 tablespoon
- ఆవాలు 1/2 teaspoon ఆవాలు Mustard seeds 1/2 teaspoon
- జీలకర్ర Cumin seeds 1/2 teaspoon
- ఎండు మిరపకాయలు Dried red chilies (broken) 2 pieces
- కరివేపాకు Curry leaves 1 sprig
- వెల్లుల్లి రెబ్బలు Garlic cloves (crushed) 4 cloves
- ఇంగువ Asafoetida 1 pinch
- మిరియాల పొడి Black pepper powder 1/2 teaspoon
తయారీ విధానం
-
టమోటాలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోయాలి. చింతపండును వేడి నీళ్లలో పది నిమిషాలు నానబెట్టి గుజ్జు తీయాలి.Wash and chop tomatoes into small pieces. Soak the tamarind in hot water for ten minutes and extract the pulp.
-
ఒక పెద్ద గిన్నెలో టమోటా ముక్కలు, చింతపండు రసం, పసుపు, ఉప్పు మరియు మూడు కప్పుల నీళ్లు పోయాలి.In a large pot, combine the chopped tomatoes, tamarind extract, turmeric, salt, and three cups of water.
-
మధ్యస్థ మంట మీద టమోటాలు మెత్తబడే వరకు మరియు చింతపండు పచ్చి వాసన పోయే వరకు బాగా మరిగించాలి.Boil the mixture on medium flame until the tomatoes become soft and the raw smell of the tamarind disappears.
-
ఇందులో బెల్లం మరియు మిరియాల పొడి వేసి మరో ఐదు నిమిషాలు మరగనివ్వాలి. టమోటా ముక్కలను గరిటెతో కొద్దిగా మెదపాలి.Add jaggery and black pepper powder, letting it simmer for another five minutes. Use a spoon to lightly mash some of the tomatoes into the broth.
-
పోపు కోసం ఒక చిన్న బాణలిలో నూనె వేడి చేయాలి. ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, దంచిన వెల్లుల్లి రెబ్బలు మరియు కరివేపాకు వేయాలి.For the tempering, heat oil in a small pan. Add mustard seeds, cumin seeds, dried red chilies, crushed garlic cloves, and curry leaves.
-
వెల్లుల్లి కొద్దిగా వేగి సువాసన వస్తున్నప్పుడు ఇంగువ వేసి వెంటనే స్టవ్ ఆపేయాలి.Once the mustard seeds crackle and the garlic turns a light golden brown, add a pinch of asafoetida and turn off the heat.
-
ఈ పోపును మరుగుతున్న చారులో వేసి కలిపి మూత పెట్టాలి.Pour this hot tempering over the boiling tomato broth and stir gently.
-
చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని వేడి వేడి అన్నంతో వడ్డించాలి.Garnish with freshly chopped coriander leaves and serve hot with steamed rice and ghee.