Edit Template

అనుపమ, జాహ్నవి, పల్లవి, శృతిల వంటింటి హడావిడి

© 2025 Telugillu
Celebrating Telugu heritage

Edit Template

అనుపమ, జాహ్నవి, పల్లవి, శృతిల వంటింటి హడావిడి

Anu, Jahnavi, Pallavi, Sruthi

పల్లవి: (గిన్నెని పరీక్షిస్తూ) ఏమే, టైమింగ్ కరెక్టేనా? లేకపోతే దబిడి దిబిడే

జాహ్నవి: పర్ఫెక్ట్ టైమింగ్ లే. ఇంకాస్త లేటయితే… బయట భోగి మంటల కన్నా ముందే ఇంట్లో అమ్మమ్మ క్లాస్ మొదలవుతుంది.

అను: (నవ్వుతూ) క్లాస్ అంటే… మీ బామ్మగారి విశ్వరూపమేగా?

పల్లవి: మరి కాదేంటి! ఈ టైంకి పొయ్యి వెలగకపోతే, అసలు సంక్రాంతే రానట్టు, సూర్యుడే ఉదయించనట్టు ఫీలవుతారు ఆవిడ.

శృతి: (నెమ్మదిగా గరిట తిప్పుతూ) మా ఇంట్లోనూ అంతేలే. కాకపోతే ఐటమ్స్ వేరు, తిట్లు వేరు.

జాహ్నవి: వంట రుచి మారుతుందేమో గానీ, పండగ రోజు వంటింట్లో ఉండే ఆ టెన్షన్ మాత్రం యూనివర్సల్ బాసూ!

అను: కరెక్ట్! పండగ రోజు వంటిల్లు అంటే… బోర్డర్ లో సోల్జర్స్ లాగా అలర్ట్ గా ఉండాలి. చిన్న తేడా వచ్చినా పెద్దల నుంచి అక్షింతలు గ్యారెంటీ.

(చిన్న విరామం, పొయ్యి మండుతున్న శబ్దం)

పల్లవి: అప్పట్లో ఈ ప్యాకెట్ పాలు, ప్యాకెట్ నెయ్యి గోల ఉండేది కాదు. అన్నీ ప్యూర్, పెరట్లో నుంచే వచ్చేవి.

జాహ్నవి: అందుకేనేమో, అప్పుడు చేసిన అరిసెలు తింటే నోట్లో కరిగిపోయేవి. ఇప్పుడు మనం చేసేవి నమలాలంటే దవడలు నొప్పులు పుడుతున్నాయి. (నవ్వులు)

శృతి: నేను కొత్తగా పెళ్లై వచ్చినప్పుడు, అమ్మమ్మ గారు ఒక డైలాగ్ వేశారు… “అమ్మాయి, పండగంటే కొత్త బట్టలేసుకొని ఫోటోలు దిగడం కాదు, పిండివంటలు వండటం” అని. ఆ దెబ్బకి ఇన్స్టాగ్రామ్ పక్కన పెట్టి ఇత్తడి గిన్నె పట్టుకున్నా.

అను: (తల ఊపుతూ) స్టార్టింగ్ లో భయంతో చేశాం. ఇప్పుడు ఇష్టంగా చేస్తున్నాం. మధ్యలో మన క్రియేటివిటీ కూడా యాడ్ చేస్తున్నాం కదా.

పల్లవి: అదేలే అసలైన మ్యాజిక్. మూలాలు అవే, కానీ చేతులు మారాయి.

జాహ్నవి: ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా… చివరికి ఆ మాడిన గిన్నెలు తోమేది మాత్రం మనమే!

అను: కానీ ఆ వాసన, ఆ సందడి… రేపు మన పిల్లలకి అవే గుర్తుండిపోతాయి.

శృతి: ఏళ్లొచ్చినా… సంక్రాంతి అంటే ఈ హడావిడే గుర్తొస్తుంది.

పల్లవి: నిజమే. పండగంటే అదే. వంటింట్లో గలగలలు లేకపోతే, పండగ కళే ఉండదు!

అనుపమ, జాహ్నవి, పల్లవి, శృతిల వంటింటి హడావిడి

కావలసిన పదార్ధాలు
తయారి విధానం
[real3dflipbook id='1']