Edit Template

సంక్రాంతి – గంగిరెద్దు విన్యాసాలు

© 2025 Telugillu
Celebrating Telugu heritage

Edit Template

సంక్రాంతి - గంగిరెద్దు విన్యాసాలు

Sri, Ananth, Medha, Aakash, Siri, Jai, Manvi

గంగిరెద్దు మెల్లగా తల ఊపుతుంది. గంటలు గణగణలాడుతున్నాయి గంగిరెద్దుల మేళం సన్నాయి శబ్దం, గంటల మోత వినిపిస్తూ ఉండగా, ఇంటి ముందు నిలబడిన యువత ఆసక్తిగా చూస్తుంటారు

మాన్వి: (ఆనంది చెయ్యి గట్టిగా పట్టుకుని) అమ్మో! ఆ గంగిరెద్దుని చూస్తుంటే భయమేస్తోంది. ఆనంది: భయమెందుకులే! అదెంత అందంగా ముస్తాబయ్యిందో చూడు. ఆకాష్: (నిశితంగా గమనిస్తూ) అబ్బబ్బ! కొమ్ములకి ఆ రంగులు, మెడలో గలగలా లాడే గంటలు… నిండుగా ఉంది. సిరి: పల్లెటూళ్లలో సంక్రాంతి అంటే ఈ గంగిరెద్దుల హడావిడే అసలైన అందం. మేధ: మనం ఈ సిటీ గోలల్లో పడి వీటిని చూడటమే మర్చిపోయాం కదా.

(అంతలో గంగిరెద్దు తల ఊపుతూ దండం పెడుతుంది, కాళ్ళ గజ్జెల సవ్వడి వినిపిస్తుంది)

ఆకాష్: అరే! భలే దండం పెట్టిందే! దానికి అలా ట్రైనింగ్ ఇస్తారా? లేక అలవాటైపోయిందా? సిరి: నాకైతే చిన్నప్పుడు దీన్ని చూసినప్పుడల్లా నడిచే బొమ్మలా అనిపించేది. మేధ: దీన్ని కేవలం ప్రదర్శన కోసమే ఇలా అలంకరించరు అనిపిస్తుంది. దీని వెనుక ఏదో లోతైన అర్థం ఉండి ఉంటుంది. తాతయ్య (ప్రశాంతంగా కలుపుకుంటూ): నిజమేనమ్మా. ఇది వేడుక కాదు, వేదాంతం. గంగిరెద్దు అంటే సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడి వాహనం… నందీశ్వరుడు. సిరి: అంటే… ఆ శివుడే మన ఇంటికి అతిథిగా వచ్చినట్టా? తాతయ్య: భావన అదే తల్లి. సంక్రాంతి లక్ష్మిని మోసుకొస్తూ, ఆ అయ్యవారే మన గడప తొక్కాడని మన నమ్మకం. ఆనంది: అందుకేనా ప్రతి ఇంటికీ తిప్పుతున్నారు? అమ్మమ్మ: అవును తల్లీ. దైవానుగ్రహం ఏ ఒక్కరి సొత్తో కాదు కదా, ఊరందరికీ దక్కాలని.

(జై భయపడుతూనే మేధ వెనక దాక్కుని చూస్తుంటాడు)

జై: అక్కా! ఈ ఎద్దు డ్యాన్స్ కూడా చేస్తుందా? సిరి: (నవ్వుతూ) అది డ్యాన్స్ కాదురా… ‘అయ్యగారికి దండం పెట్టు’ అంటే మనకి మర్యాద చేస్తోంది. (గంగిరెద్దుల వాడు కానుకలు తీసుకుని ముందుకు కదులుతాడు) మేధ: (వెళ్తున్న వైపు చూస్తూ) ఆ సన్నాయి మేళం, ఆ గంటల చప్పుడు… మనసుల్ని ఎలా లాగేస్తోందో చూడు. అందరినీ బయటికి రప్పించేసింది. ఆకాష్: అవును. నాలుగు గోడల మధ్య కూర్చుంటే పండగ అవ్వదు. ఇలా అందరూ కలిస్తేనే అసలైన పండగ. సిరి: నిజంగా… ఈ వీధే ఒక రంగస్థలంలా మారిపోయింది.

సంక్రాంతి – గంగిరెద్దు విన్యాసాలు

కావలసిన పదార్ధాలు
తయారి విధానం
[real3dflipbook id='1']