పూర్ణం బూరెలు

Poornam Burelu
పండుగ వేళ నోరూరించే సంప్రదాయ తీపి వంటకం!
A timeless traditional Telugu festival delight!

పూర్ణం బూరెలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో అత్యంత ప్రజాదరణ పొందిన పండుగ పిండివంట. ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి వంటి పండుగలలో మరియు వివాహ వేడుకలలో వీటిని దేవుడికి నైవేద్యంగా సమర్పించి, అతిథులకు ప్రత్యేకంగా వడ్డిస్తారు. ఇది నా చిన్ననాటి మధుర జ్ఞాపకం.

Poornam Burelu is an iconic sweet from the heart of Telugu cuisine. Usually prepared during major festivals like Sankranthi or Ugadi and at weddings, these deep-fried dumplings feature a luscious chana dal and jaggery filling encased in a crispy rice-lentil shell. It represents the warmth of South Indian hospitality.

తయారి సమయం

6 hours soaking, 30 minutes prep
వండే సమయం

40 minutes
పరిమాణం

15 to 20 Burelu
కష్టం

Medium

కావలసిన పదార్ధాలు

  • మినపప్పు Urad Dal (Skinless) 1 cup
  • బియ్యం Rice (Raw) 2 cups
  • శనగపప్పు Chana Dal (Bengal Gram) 1 cup
  • బెల్లం Jaggery (Grated) 1 cup
  • యాలకుల పొడి Cardamom Powder (Fine Powder) 1/2 teaspoon
  • ఉప్పు Salt (Sea Salt) 1 pinch
  • నూనె Oil (Refined Vegetable Oil) Deep frying
  • నెయ్యి Ghee (Clarified Butter) 1 tablespoon

తయారీ విధానం

  1. మినపప్పు మరియు బియ్యాన్ని విడివిడిగా లేదా కలిపి శుభ్రంగా కడిగి కనీసం 6 నుండి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి.
    Wash and soak urad dal and rice together or separately for at least 6 to 8 hours.
  2. శనగపప్పును కూడా కడిగి 2 గంటల పాటు నానబెట్టి, తగినంత నీటితో కుక్కర్‌లో మూడు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి.
    Wash and soak chana dal for 2 hours, then pressure cook with just enough water for about 3 whistles until soft.
  3. నానబెట్టిన మినపప్పు మరియు బియ్యాన్ని కలిపి మెత్తటి పిండిలా (దోశ పిండి కంటే కొంచెం చిక్కగా) గ్రైండ్ చేసి, అందులో చిటికెడు ఉప్పు కలపాలి.
    Grind the soaked urad dal and rice into a very fine, smooth, and thick batter; the consistency should be slightly thicker than regular dosa batter.
  4. ఉడికించిన శనగపప్పులోని నీటిని పూర్తిగా వడకట్టి, అందులో బెల్లం తురుము వేసి స్టవ్ మీద పెట్టి దగ్గరపడే వరకు ఉడికించాలి.
    Drain any excess water from the cooked chana dal completely, add the grated jaggery, and cook on a medium flame until the mixture thickens and leaves the sides of the pan.
  5. ఈ మిశ్రమంలో యాలకుల పొడి మరియు నెయ్యి వేసి బాగా కలిపి, చల్లారిన తర్వాత చిన్న చిన్న నిమ్మకాయ పరిమాణంలో ఉండలుగా చుట్టుకోవాలి.
    Stir in the cardamom powder and ghee into the stuffing mixture, allow it to cool down, and then shape into small round balls.
  6. బాణలిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేయాలి.
    Heat a generous amount of oil in a deep frying pan or kadai.
  7. తయారు చేసుకున్న శనగపప్పు ఉండలను ఒక్కొక్కటిగా బియ్యం-మినపప్పు పిండిలో ముంచి, పిండి సమానంగా పూసిన తర్వాత నూనెలో జాగ్రత్తగా వేయాలి.
    Gently dip each stuffing ball into the prepared batter, ensuring it is fully and evenly coated on all sides.
  8. బూరెలు అన్ని వైపులా సమానంగా వేగి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించి తీసి వేడివేడిగా వడ్డించాలి.
    Carefully drop the coated balls into the hot oil and fry on medium heat until they turn a perfect golden brown and crispy.

పూర్ణం బూరెలు

పండుగ వేళ నోరూరించే సంప్రదాయ తీపి వంటకం!

కావలసిన పదార్ధాలు
  • మినపప్పు Urad Dal (Skinless) 1 cup
  • బియ్యం Rice (Raw) 2 cups
  • శనగపప్పు Chana Dal (Bengal Gram) 1 cup
  • బెల్లం Jaggery (Grated) 1 cup
  • యాలకుల పొడి Cardamom Powder (Fine Powder) 1/2 teaspoon
  • ఉప్పు Salt (Sea Salt) 1 pinch
  • నూనె Oil (Refined Vegetable Oil) Deep frying
  • నెయ్యి Ghee (Clarified Butter) 1 tablespoon
తయారి సమయం

6 hours soaking, 30 minutes prep
వండే సమయం

40 minutes
పరిమాణం

15 to 20 Burelu
కష్టం

Medium

పూర్ణం బూరెలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో అత్యంత ప్రజాదరణ పొందిన పండుగ పిండివంట. ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి వంటి పండుగలలో మరియు వివాహ వేడుకలలో వీటిని దేవుడికి నైవేద్యంగా సమర్పించి, అతిథులకు ప్రత్యేకంగా వడ్డిస్తారు. ఇది నా చిన్ననాటి మధుర జ్ఞాపకం.

తయారి విధానం
  1. మినపప్పు మరియు బియ్యాన్ని విడివిడిగా లేదా కలిపి శుభ్రంగా కడిగి కనీసం 6 నుండి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి.
    Wash and soak urad dal and rice together or separately for at least 6 to 8 hours.
  2. శనగపప్పును కూడా కడిగి 2 గంటల పాటు నానబెట్టి, తగినంత నీటితో కుక్కర్‌లో మూడు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి.
    Wash and soak chana dal for 2 hours, then pressure cook with just enough water for about 3 whistles until soft.
  3. నానబెట్టిన మినపప్పు మరియు బియ్యాన్ని కలిపి మెత్తటి పిండిలా (దోశ పిండి కంటే కొంచెం చిక్కగా) గ్రైండ్ చేసి, అందులో చిటికెడు ఉప్పు కలపాలి.
    Grind the soaked urad dal and rice into a very fine, smooth, and thick batter; the consistency should be slightly thicker than regular dosa batter.
  4. ఉడికించిన శనగపప్పులోని నీటిని పూర్తిగా వడకట్టి, అందులో బెల్లం తురుము వేసి స్టవ్ మీద పెట్టి దగ్గరపడే వరకు ఉడికించాలి.
    Drain any excess water from the cooked chana dal completely, add the grated jaggery, and cook on a medium flame until the mixture thickens and leaves the sides of the pan.
  5. ఈ మిశ్రమంలో యాలకుల పొడి మరియు నెయ్యి వేసి బాగా కలిపి, చల్లారిన తర్వాత చిన్న చిన్న నిమ్మకాయ పరిమాణంలో ఉండలుగా చుట్టుకోవాలి.
    Stir in the cardamom powder and ghee into the stuffing mixture, allow it to cool down, and then shape into small round balls.
  6. బాణలిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేయాలి.
    Heat a generous amount of oil in a deep frying pan or kadai.
  7. తయారు చేసుకున్న శనగపప్పు ఉండలను ఒక్కొక్కటిగా బియ్యం-మినపప్పు పిండిలో ముంచి, పిండి సమానంగా పూసిన తర్వాత నూనెలో జాగ్రత్తగా వేయాలి.
    Gently dip each stuffing ball into the prepared batter, ensuring it is fully and evenly coated on all sides.
  8. బూరెలు అన్ని వైపులా సమానంగా వేగి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించి తీసి వేడివేడిగా వడ్డించాలి.
    Carefully drop the coated balls into the hot oil and fry on medium heat until they turn a perfect golden brown and crispy.
[real3dflipbook id='1']