Edit Template

తెలుగింటి భోగి సంబరాలు

© 2025 Telugillu
Celebrating Telugu heritage

Edit Template

తెలుగింటి భోగి సంబరాలు

Sri, Ananth, Prudhvi, Medha, Aakash, Varun, Anandi, Abhijeet, Siri, Surya

సిరి (విస్ఫారిత నేత్రాలతో అరిటాకు వంక చూస్తూ) అమ్మమ్మా… ఇదంతా టిఫినా? మధ్యాహ్నం భోజనం కాదు కదా? అమ్మమ్మ (నవ్వుతూ) సంక్రాంతి పొద్దు అంటే ఇడ్లీ, దోశ అనుకున్నావా? పండగ నాడు పొట్ట ఖాళీగా ఉండకూడదంతే. సూర్య: అసలు ఈ బ్రేక్‌ఫాస్టులు, లంచ్‌లు అని విడగొట్టి తినడం ఈ మధ్య వచ్చిన ఫ్యాషన్లు తల్లీ. పృథ్వీ : మా చిన్నప్పుడు పొద్దున మొదలెడితే రాత్రి దాకా ‘నాన్‌స్టాప్ ‘. బ్రేకులు ఉండవు, ఆకలి అసలే ఉండదు. వరుణ్ (నవ్వుతూ): కొత్త అల్లుడిగా వచ్చినప్పుడు నాకు అదే షాక్. పొద్దున్నే మీ ఇంట్లో గారెలు, బూరెలు, పొంగలి… ఒకటా రెండా? కడుపు నిండినా కళ్ళు ఆకలిగానే చూసేవి. మేధ : వరుణ్ మావయ్యా, మరి మీ ఇంట్లో పద్ధతి ఎలా ఉండేది? వరుణ్: మా ఇంట్లో సంక్రాంతి అంటే కొత్త బియ్యం పొంగలి వాసన గుప్పుమనాల్సిందే. ఆ ఘమఘమ లేకపోతే ఇంట్లో పండగ మొదలైనట్టే కాదు. ఆవు పాలతో చేసిన పరవన్నం. పొగలు గక్కుతూ, పొద్దున్నే… జై (ఆశ్చర్యంగా): ఆవు పాలా? ప్యాకెట్ పాలు కాదా? వరుణ్ (నవ్వుతూ): కాదురా బుజ్జిగా. అప్పట్లో పాలు ప్లాస్టిక్ కవర్లలో రావు, డైరెక్టుగా పాడి నుంచే వచ్చేవి. అమ్మమ్మ: అందుకే ఆ రుచి ఇప్పటికీ గుర్తుండిపోయింది. తాతయ్య (తల ఊపుతూ): కాలాన్ని, పంటని గౌరవించడం అంటే అదేరా. అభిజీత్: మాకైతే సంక్రాంతి అంటే సకినాలే. తీపి కాదు, కారం కాదు… శబ్దం ముఖ్యం ఆకాష్: శబ్దమా? అభిజీత్: మరి! నములుతుంటే ‘కరక్ కరక్’ అని సౌండ్ రావాలి. పక్కింటోడికి వినిపించాలి మనం పండగ జరుపుకుంటున్నామని. ఆ మ్యూజికే వేరు. (అందరూ గట్టిగా నవ్వారు) సిరి (మృదువుగా): పండగ ఒక్కటే… కానీ తలా ఒక తీపి జ్ఞాపకం. ఆనంది: ఈ టేబుల్ దగ్గర పదార్థాల కన్నా కథలే ఎక్కువ ఉన్నాయి. అభిజీత్: పెళ్లయ్యాక గానీ నాకు అర్థం కాలేదు… కుటుంబాలు కలిస్తే పండగలు, పిండివంటలు కూడా డబుల్ అయితాయని. తాతయ్య (అందరినీ కలయజూస్తూ): చూశారా… ఈ టేబుల్ దగ్గర ఇప్పుడు మూడు తరాలు కూర్చున్నాయి. పృథ్వీ: కాలం మారుతోంది, రుచి మారుతోంది. సూర్య: కానీ ఒకటి మాత్రం మారదు. (నిదానంగా, అందరినీ గమనించి) సిరి: అందరం కలిసి తినడంలోని ఆనందం. (అమ్మమ్మ మనవరాలిని చూసి మురిసిపోతుంది) అమ్మమ్మ: అదేరా సంక్రాంతి అంటే. విస్తట్లో వడ్డించింది అయిపోవచ్చు… కానీ ఈ జ్ఞాపకం మాత్రం కడుపు నింపి పంపిస్తుంది.

తెలుగింటి భోగి సంబరాలు

కావలసిన పదార్ధాలు
తయారి విధానం
[real3dflipbook id='1']