Edit Template

భోగి మంటలు – కబుర్లు
అమ్మమ్మ, మాన్వి, జై

© 2025 Telugillu
Celebrating Telugu heritage

Edit Template

భోగి మంటలు - కబుర్లు
అమ్మమ్మ, మాన్వి, జై

Sri, Jai, Manvi

తెల్లవారుజామున ఇంటి ముందు వేసిన భోగి మంటల చుట్టూ అమ్మమ్మ, మాన్వి, జై కూర్చుని ఉన్నారు. మంటల వెలుగు వారి ముఖాలపై ప్రతిబింబిస్తోంది.

మాన్వి, మంటల వైపు కుతూహలంతో చూస్తూ

  “అమ్మమ్మా… అసలు ఈ భోగి మంటలు ఎందుకు వేస్తారు?”

అమ్మమ్మ నవ్వుతూ, మనవరాలి తల నిమురుతూ

  “ఎందుకంటే…భోగి అంటే పాతవి, ఇంక పనికి రానివి తీసేసి మంటలలో వేస్తారు”

జై ఉత్సాహంగా

  “నాకైతే ఆ మంటలు చూడటమే ఇష్టం. ఆకాశమంత ఎత్తులో…   పెద్ద మంట! బిగ్ ఫైర్!”

అమ్మమ్మ తలూపుతూ, కళ్ళలో ఏదో జ్ఞాపకం మెదులుతుండగా

 “అవునురా. కానీ మా చిన్నప్పుడు ఆ మంటలు చూడటం మాత్రమే   కాదు, ఆ మంటల వెలుగులోనే మా పండగ మొదలయ్యేది. ఆ   వెచ్చదనంలోనే మేం పెరిగాం.”

మాన్వి :

  “అదెలా అమ్మమ్మా?”

అమ్మమ్మ దూరంగా చూస్తూ, గొంతులో ఆర్ద్రతతో

“తెల్లవారుజామునే ఇంకా కోడి కూయకముందే మా అమ్మ   లేపేది.  ‘లేవవే… భోగి తెల్లారింది’ అని.  ఆ చలిలో బావి నీళ్ళ   స్నానం… అమ్మ చెంబుతో తల మీద నీళ్ళు కుమ్మరిస్తుంటే గజగజా   వణికేవాళ్ళం. చలికి ఏడుపొచ్చేది. కానీ, ఆ తడి జుట్టుతో పరుగెత్తుకెళ్ళి ఆ భోగి మంట ముందు   కూర్చుంటే… ఆ వెచ్చదనం ఒంట్లోకే కాదు, నరనరాల్లోకి పాకేది.”

జై:  “అప్పుడు టీవీ ఉండేదా అమ్మమ్మా?” అమ్మమ్మ చిన్నగా నవ్వి

 “మనుషులు ఉండేవారు. మనసు విప్పి మాట్లాడుకునే ముచ్చట్లు   ఉండేవి. గలగలా నవ్వులు ఉండేవి. ఎడ్ల బండి మీద కొత్త ధాన్యం   ఇంటికి వచ్చేది… ఊరు ఊరంతా ఒకే ఇల్లులా అనిపించేది.

మాన్వి ఆశ్చర్యంగా

 “నిజంగానా? అచ్చం మా డ్రాయింగ్ బుక్ లో బొమ్మలాగానా”

అమ్మమ్మ ప్రశాంతంగా నవ్వుతూ,

 “అవును తల్లి… మీరు ఇప్పుడు పుస్తకాల్లో చూస్తున్నది… మేము   బతికిన జీవితం. అందుకే… భోగి అంటే నాకు కేవలం మంటలు కాదు… మమకారాలు గుర్తొస్తాయి. మా ఇల్లు గుర్తొస్తుంది.”

భోగి మంటలు – కబుర్లు
అమ్మమ్మ, మాన్వి, జై

కావలసిన పదార్ధాలు
తయారి విధానం
[real3dflipbook id='1']