Edit Template

తోబుట్టువుల అల్లరి – పృథ్వి, జాహ్నవి, పల్లవి, సూర్య

© 2025 Telugillu
Celebrating Telugu heritage

Edit Template

తోబుట్టువుల అల్లరి - పృథ్వి, జాహ్నవి, పల్లవి, సూర్య

Anu, Jahnavi, Pallavi, Sruthi

పల్లవి: (మంటల వంక చూస్తూ) ఈ సారి మంటలు భలే పేర్చార్రా. చూడ్డానికి నిండుగా, చక్కగా ఉంది. సూర్య: మంట బాగుండటం కాదే… అందులో అందరిదీ కలిసి ఉండటం ముఖ్యం. పృథ్వీ: (చిలిపిగా నవ్వుతూ) కరెక్టే… ఎవడి మంట ఎత్తుగా లేచింది అని కాదు… ఎవడి ‘చెయ్యి’ (contribution) ఎక్కువ పడింది అని. జాహ్నవి: (నవ్వేస్తూ) నువ్వు ఆ మాట అనగానే నాకు గుర్తొచ్చేది ఒకటే… పల్లవి: అదేగా… ఆ పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంట్లో సామాన్లు మాయం అయిన రోజు? సూర్య: (చేతులెత్తేసి) ఒరేయ్… అబ్బబ్బా… మళ్ళీ మొదలెట్టారా? అది చిన్నప్పుడు ఎప్పుడో జరిగిందే… పృథ్వీ: జరిగిందా? భోగి మంటలో ఆ టీపాయ్ (Teapoy) సగం కాలి బూడిద అయ్యాక… దాన్ని జరగడం అనరు, చరిత్ర అంటారు. జాహ్నవి: పాపం ఆవిడ పొద్దున్నే అమ్మమ్మ దగ్గరికి వచ్చి… “మీ సూర్యం రాత్రికి రాత్రి మా టీపాయ్ ఎత్తుకెళ్ళిపోయాడు” అని గోల. పల్లవి: (సీరియస్ గా నటిస్తూ) అమ్మ మొహం చూడాలి అప్పుడు… ఫస్ట్ షాక్, ఆ తర్వాత నవ్వు ఆపుకుంటూ… సూర్య: నవ్వు కాదులే… “పిల్లాడు కదండీ… భోగి కదా పోనీలేండి” అని చిన్న కవరింగ్. పృథ్వీ: అది కవరింగ్ కాదురా… ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం. జాహ్నవి: నిజమే, భోగి మంట అంటే మన ఒక్కరిది కాదుగా… వీధి మొత్తానిది. పల్లవి: అందుకే ఆ రోజు… కంప్లైంట్స్ కూడా అంత సీరియస్ గా ఉండేవి కావు. (గాలి వీస్తుంది. చలికి అందరూ దగ్గరగా జరుగుతారు. ఒక క్షణం నిశ్శబ్దం) సూర్య: (మంట వైపు చూస్తూ గొంతు తగ్గించి) ఇప్పుడు చూస్తుంటే… మన పిల్లలకి ఆ ఫీలింగ్, ఆ ఎమోషన్ మిస్ అవుతుందేమో అనిపిస్తోంది. పృథ్వీ: మిస్ అవ్వడం కాదు… వాళ్ళకి అసలు ఆ అనుభవమే లేదు. పల్లవి: మంట చుట్టూ చేతులు కాల్చుకోవడం, ఆ కబుర్లు, అందరూ కలిసి మెలిసి ఆ సందడి… జాహ్నవి: ఇప్పుడేముంది? అలారం మోగడం, లేవడం, మంట ముందు ఓ సెల్ఫీ దిగడం… ‘హ్యాపీ భోగి’ అని స్టేటస్ పెట్టడం. అంతే. ఖేల్ ఖతం. సూర్య: మనం చేసిన ఆ చిలిపి పనులు కూడా… ఆ రోజుని గుర్తుపెట్టుకోవడానికే కదరా. పృథ్వీ: (చిన్న నవ్వుతో) అవును… చివరకి రూల్స్ కన్నా… ఆ జ్ఞాపకాలే మిగిలాయి. (నిశ్శబ్దం. మేడ మీద చలి గాలి శబ్దం) పల్లవి: రేపు పొద్దున్నే… పిల్లల్ని తప్పకుండా లేపుదాం. జాహ్నవి: మంట దగ్గర కూర్చోబెట్టి… ఈ కథలు చెప్దాం. సూర్య: అట్లీస్ట్ ఈ ఫీలింగ్ నైనా వాళ్ళకి పాస్ చేద్దాం. పృథ్వీ: (తల ఊపుతూ) అదే మనం వాళ్ళకి ఇచ్చే నిజమైన ఆస్తి.

తోబుట్టువుల అల్లరి – పృథ్వి, జాహ్నవి, పల్లవి, సూర్య

కావలసిన పదార్ధాలు
తయారి విధానం
[real3dflipbook id='1']