ఉసిరి ఆవకాయ
Amla Pickle
ఆరోగ్యంతో కూడిన ఘాటైన ఉసిరి రుచి!
A tangy burst of spice!
దక్షిణ భారత గృహాలలో ఉసిరికాయ పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా, విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. మా అమ్మమ్మ ఈ పచ్చడిని శీతాకాలం ప్రారంభంలోనే తయారు చేసి భద్రపరిచేది.
Amla (Gooseberry) pickle is a timeless classic in South Indian cuisine. Known for its longevity and immense health benefits, it was a winter ritual in many households to prepare large batches. This recipe captures the authentic flavor of sun-ripened gooseberries mixed with traditional spices.
తయారి సమయం
20 Minutes
20 Minutes
వండే సమయం
15 minutes
15 minutes
పరిమాణం
1 Kg of Pickle
1 Kg of Pickle
కష్టం
Medium
Medium
కావలసిన పదార్ధాలు
- ఉసిరికాయలు Amla Indian Gooseberries 500g
- వేరుశనగ నూనె Groundnut Oil 1 cup
- ఎండు మిర్చి పొడి Red Chili Powder 1/2 cup
- ఆవ పొడి Mustard Powder 1/2 cup
- ఉప్పు Salt 1/4 cup
- మెంతి పొడి Fenugreek Powder 1 teaspoon
- పసుపు Turmeric Powder 1/2 teaspoon
- ఆవాలు Mustard Seeds 1 teaspoon
- ఇంగువ Asafoetida (Hing) 1/4 teaspoon
- వెల్లుల్లి రెబ్బలు Peeled and crushed 10 Garlic Cloves
- రెమ్మలు కరివేపాకు Curry Leaves 2 twigs
తయారీ విధానం
-
మొదట ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా పూర్తిగా తుడిచి ఆరబెట్టండి. ఒక్క చుక్క తడి ఉన్నా పచ్చడి పాడవుతుంది.Wash the amla thoroughly and wipe them with a dry cloth. Ensure there is no moisture left, as water can cause the pickle to spoil.
-
ఒక బాణలిలో నూనె వేడి చేసి, ఉసిరికాయలను మధ్యస్థ మంట మీద వేయించండి. కాయలు మెత్తబడి లేత రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టుకోండి.Heat oil in a pan and deep fry or sauté the amla on medium flame until they become soft and change color slightly. Remove and keep aside.
-
అదే నూనెలో ఆవాలు, ఇంగువ, దంచిన వెల్లుల్లి మరియు కరివేపాకు వేసి తాలింపు పెట్టండి. తాలింపు చల్లారే వరకు పక్కన ఉంచండి.In the same oil, add mustard seeds, asafoetida, crushed garlic cloves, and curry leaves for tempering. Let the tempering cool down completely.
-
ఒక పొడి పాత్రలో వేయించిన ఉసిరికాయలు, కారం, ఆవ పొడి, మెంతి పొడి, ఉప్పు మరియు పసుపు వేసి బాగా కలపండి.In a dry mixing bowl, combine the fried amla with red chili powder, mustard powder, fenugreek powder, salt, and turmeric powder.
-
ఇప్పుడు చల్లారిన తాలింపును ఈ మిశ్రమంలో కలిపి బాగా కలపండి.Pour the cooled tempering over the amla mixture and mix everything thoroughly so the spices coat the gooseberries evenly.
-
ఈ పచ్చడిని ఒక గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరుచుకోండి. మూడు రోజుల తర్వాత ఉసిరికాయలు మసాలాలను పీల్చుకుని మరింత రుచిగా తయారవుతాయి.Store the pickle in a clean, airtight glass jar. Allow it to rest for at least three days before consuming to let the flavors develop fully.