దోసకాయ కూర

Dosakaya Kura
రుచికరమైన ఆంధ్ర స్టైల్ దోసకాయ వంటకం.
A tangy and savory Andhra classic.

ఆంధ్ర ఇళ్ళలో దోసకాయ అంటే తెలియని వారు ఉండరు. ముఖ్యంగా ఈ కూర అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. మా అమ్మమ్మ చేసే ఈ కూరలో దోసకాయ ముక్కలు మరీ మెత్తగా అవ్వకుండా, కాస్త కరకరలాడుతూ మసాలాతో కలిసుంటే ఆ రుచే వేరు.

Dosakaya, the iconic yellow cucumber of Andhra Pradesh, holds a special place in Telugu households. This curry reminds me of my grandmother’s kitchen, where the crunch of the cucumber was perfectly balanced with spicy tempering. It’s simple, comforting, and quintessentially South Indian.

తయారి సమయం

10 mins
వండే సమయం

15 mins
పరిమాణం

4
కష్టం

Easy

కావలసిన పదార్ధాలు

  • దోసకాయ Yellow Cucumber (Peeled and diced) 500g
  • నూనె Cooking Oil (For tempering) 2 tbsp
  • ఆవాలు Mustard Seeds (Rai) 1 tsp
  • జీలకర్ర Cumin Seeds (Jeera) 1 tsp
  • మినప్పప్పు Urad Dal (Split black gram) 1 tsp
  • శనగపప్పు Chana Dal (Bengal gram) 1 tsp
  • ఎండు మిర్చి Dried Red Chilies (Broken) 2
  • కరివేపాకు రెబ్బలు Curry Leaves (Fresh) 10
  • పచ్చి మిర్చి Green Chilies (Slit) 2
  • పసుపు Turmeric Powder (Haldi) 1/2 tsp
  • కారం Red Chili Powder (Adjust to spice level) 1 tsp
  • ఉప్పు Salt (As per preference) To taste
  • కొత్తిమీర Coriander Leaves (Finely chopped) Handful

తయారీ విధానం

  1. దోసకాయను శుభ్రంగా కడిగి, తొక్క తీసి, చిన్న ముక్కలుగా కోసుకోవాలి. గింజలు చేదుగా ఉన్నాయేమో ఒకసారి రుచి చూసి అవసరమైతే తీసేయాలి.
    Wash the yellow cucumber, peel it, and cut it into small cubes. Taste a small piece to check for bitterness; if the seeds are bitter, remove them.
  2. బాణలిలో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించాలి.
    Heat oil in a pan and add mustard seeds, cumin seeds, urad dal, and chana dal. Saute until the lentils turn golden brown.
  3. అందులో ఎండు మిర్చి, కరివేపాకు, పచ్చి మిర్చి వేసి చిటపటలాడనివ్వాలి.
    Add dried red chilies, curry leaves, and green chilies. Let them splutter for a few seconds.
  4. ఇప్పుడు కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, పసుపు మరియు ఉప్పు వేసి బాగా కలపాలి.
    Add the chopped cucumber pieces, turmeric powder, and salt. Mix well to combine everything.
  5. మూత పెట్టి మధ్యస్థ మంట మీద దోసకాయ ముక్కలు మెత్తబడే వరకు 8 నుండి 10 నిమిషాలు ఉడికించాలి.
    Cover with a lid and cook on medium-low heat for 8-10 minutes or until the cucumber pieces become tender.
  6. ముక్కలు ఉడికిన తర్వాత కారం వేసి మరో 2 నిమిషాలు వేయించాలి.
    Add the red chili powder and sauté for another 2 minutes until the raw smell of the spice disappears.
  7. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపేయాలి. వేడి అన్నంతో వడ్డించండి.
    Garnish with freshly chopped coriander leaves and turn off the heat. Serve warm with rice.

దోసకాయ కూర

రుచికరమైన ఆంధ్ర స్టైల్ దోసకాయ వంటకం.

కావలసిన పదార్ధాలు
  • దోసకాయ Yellow Cucumber (Peeled and diced) 500g
  • నూనె Cooking Oil (For tempering) 2 tbsp
  • ఆవాలు Mustard Seeds (Rai) 1 tsp
  • జీలకర్ర Cumin Seeds (Jeera) 1 tsp
  • మినప్పప్పు Urad Dal (Split black gram) 1 tsp
  • శనగపప్పు Chana Dal (Bengal gram) 1 tsp
  • ఎండు మిర్చి Dried Red Chilies (Broken) 2
  • కరివేపాకు రెబ్బలు Curry Leaves (Fresh) 10
  • పచ్చి మిర్చి Green Chilies (Slit) 2
  • పసుపు Turmeric Powder (Haldi) 1/2 tsp
  • కారం Red Chili Powder (Adjust to spice level) 1 tsp
  • ఉప్పు Salt (As per preference) To taste
  • కొత్తిమీర Coriander Leaves (Finely chopped) Handful
తయారి సమయం

10 mins
వండే సమయం

15 mins
పరిమాణం

4
కష్టం

Easy

ఆంధ్ర ఇళ్ళలో దోసకాయ అంటే తెలియని వారు ఉండరు. ముఖ్యంగా ఈ కూర అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. మా అమ్మమ్మ చేసే ఈ కూరలో దోసకాయ ముక్కలు మరీ మెత్తగా అవ్వకుండా, కాస్త కరకరలాడుతూ మసాలాతో కలిసుంటే ఆ రుచే వేరు.

తయారి విధానం
  1. దోసకాయను శుభ్రంగా కడిగి, తొక్క తీసి, చిన్న ముక్కలుగా కోసుకోవాలి. గింజలు చేదుగా ఉన్నాయేమో ఒకసారి రుచి చూసి అవసరమైతే తీసేయాలి.
    Wash the yellow cucumber, peel it, and cut it into small cubes. Taste a small piece to check for bitterness; if the seeds are bitter, remove them.
  2. బాణలిలో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించాలి.
    Heat oil in a pan and add mustard seeds, cumin seeds, urad dal, and chana dal. Saute until the lentils turn golden brown.
  3. అందులో ఎండు మిర్చి, కరివేపాకు, పచ్చి మిర్చి వేసి చిటపటలాడనివ్వాలి.
    Add dried red chilies, curry leaves, and green chilies. Let them splutter for a few seconds.
  4. ఇప్పుడు కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, పసుపు మరియు ఉప్పు వేసి బాగా కలపాలి.
    Add the chopped cucumber pieces, turmeric powder, and salt. Mix well to combine everything.
  5. మూత పెట్టి మధ్యస్థ మంట మీద దోసకాయ ముక్కలు మెత్తబడే వరకు 8 నుండి 10 నిమిషాలు ఉడికించాలి.
    Cover with a lid and cook on medium-low heat for 8-10 minutes or until the cucumber pieces become tender.
  6. ముక్కలు ఉడికిన తర్వాత కారం వేసి మరో 2 నిమిషాలు వేయించాలి.
    Add the red chili powder and sauté for another 2 minutes until the raw smell of the spice disappears.
  7. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపేయాలి. వేడి అన్నంతో వడ్డించండి.
    Garnish with freshly chopped coriander leaves and turn off the heat. Serve warm with rice.
[real3dflipbook id='1']