కరకరలాడే మొక్కజొన్న గారెలు
Golden Sweet Corn Fritters
కరకరలాడే మొక్కజొన్న గారెలు
A crunchy, golden snack perfect for monsoon evenings.
తెలుగు ఇళ్లలో ‘మొక్కజొన్న గారెలు’ అంటే తెలియని వారుండరు. మా అమ్మమ్మ రోట్లో తాజా మొక్కజొన్న గింజలను దంచి ఈ గారెలు చేసేవారు; ఆ వేయించిన మొక్కజొన్న సువాసన ఇల్లంతా నిండిపోయేది. ఇవి బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండి అద్భుతమైన రుచిని ఇస్తాయి.
Corn fritters, known as ‘Mokka Jonna Garelu’ in Telugu households, are a timeless snack. I remember my grandmother grinding fresh corn on a stone mortar to make these; the aroma of frying corn would fill the entire house. These fritters are crunchy on the outside and soft on the inside.
తయారి సమయం
15 minutes
15 minutes
వండే సమయం
20 minutes
20 minutes
పరిమాణం
4
4
కష్టం
Easy
Easy
కావలసిన పదార్ధాలు
- మొక్కజొన్న గింజలు Sweet Corn kernels (Fresh or frozen) 2 cups
- పచ్చి మిరపకాయలు Green chilies 4
- అల్లం ముక్క Ginger piece 1 inch
- జీలకర్ర Cumin seeds 1 teaspoon
- ఉప్పు Salt (as per taste) 1 teaspoon
- బియ్యప్పిండి Rice flour (for binding) 2 tablespoons
- ఉల్లిపాయ Onion (finely chopped) 1 medium
- కొత్తిమీర తరుగు Coriander leaves (finely chopped) 2 tablespoons
- నూనె Cooking oil (for deep frying) 500 milliliters
తయారీ విధానం
-
మొదట మొక్కజొన్న గింజలు, అల్లం, మరియు పచ్చిమిర్చిని ఒక మిక్సీ జార్ లో తీసుకోవాలి.Place the sweet corn kernels, ginger, and green chilies into a blender or food processor.
-
నీళ్లు అస్సలు పోయకుండా ఈ మిశ్రమాన్ని కచ్చాపచ్చాగా (కోర్స్ గా) గ్రైండ్ చేయాలి.Grind the mixture into a coarse paste without adding any water.
-
గ్రైండ్ చేసిన ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో బియ్యప్పిండి, ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర మరియు జీలకర్ర వేయాలి.Transfer the ground mixture into a mixing bowl and add rice flour, salt, finely chopped onions, coriander leaves, and cumin seeds.
-
అన్ని పదార్థాలు కలిసేలా బాగా కలుపుకోవాలి. పిండి మరీ జారుగా ఉంటే ఇంకొంచెం బియ్యప్పిండి కలపవచ్చు.Mix all the ingredients thoroughly. If the mixture is too wet, add a little more rice flour for better binding.
-
స్టవ్ మీద బాణలి పెట్టి వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి.Heat oil in a deep frying pan over medium-high heat.
-
చేతికి కొద్దిగా నూనె లేదా నీరు రాసుకుని, పిండిని చిన్న నిమ్మకాయ సైజు ఉండలుగా తీసుకుని గారెల్లా వత్తాలి.Grease your palms with a little oil or water, take small portions of the dough, and flatten them into small discs or patties.