కొబ్బరి మామిడికాయ పచ్చడి
Kobbari Mamidikaya Pachadi
రుచికరమైన ఆంధ్ర స్టైల్ మామిడికాయ కొబ్బరి పచ్చడి!
A tangy and creamy traditional Andhra delight!
మామిడికాయలు దొరికే వేసవి కాలంలో ప్రతి ఇంట్లోనూ కొబ్బరి మామిడికాయ పచ్చడి ఖచ్చితంగా ఉంటుంది. తీపి కొబ్బరి, పుల్లని మామిడికాయల కలయిక ఈ పచ్చడికి ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. మా చిన్నతనంలో అమ్మమ్మ గారు చేసే ఈ పచ్చడి, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు.
Kobbari Mamidikaya Pachadi is a staple in Andhra households during the summer months when mangoes are in season. This recipe combines the sweetness of fresh coconut with the tartness of raw mango, creating a flavor explosion. Growing up, this was a regular feature in my grandmother’s kitchen, served with a dollop of ghee and hot rice.
తయారి సమయం
15 minutes
15 minutes
వండే సమయం
5 minutes
5 minutes
పరిమాణం
4
4
కష్టం
Easy
Easy
కావలసిన పదార్ధాలు
- కొబ్బరి తురుము Coconut (Freshly Grated) 1 cup
- మామిడికాయ ముక్కలు Raw Mango (Peeled and Diced) 1 cup
- పచ్చి మిరపకాయలు Green Chilies (Adjust to taste) 5
- నూనె Oil (For tempering) 2 teaspoons
- ఆవాలు Mustard Seeds 1 teaspoon
- జీలకర్ర Cumin Seeds 1 teaspoon
- మినప్పప్పు Split Black Gram (Urad Dal) 1 teaspoon
- ఇంగువ Asafoetida (Hing) 1/4 teaspoon
- ఎండు మిరపకాయలు Dried Red Chilies 2
- రెమ్మ కరివేపాకు Curry Leaves 1
- ఉప్పు Salt To taste
తయారీ విధానం
-
ముందుగా మామిడికాయను కడిగి, పైన తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.Wash the raw mango, peel the skin, and cut it into small cubes.
-
మిక్సీ జార్‌లో మామిడికాయ ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, పచ్చి మిరపకాయలు మరియు రుచికి సరిపడా ఉప్పు వేయాలి.In a blender jar, add the raw mango pieces, freshly grated coconut, green chilies, and salt.
-
ఈ మిశ్రమాన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతేనే కొద్దిగా నీళ్లు పోయాలి.Coarsely grind the mixture without adding too much water to maintain a textured consistency.
-
తయారు చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.Transfer the ground paste into a serving bowl.
-
తాలింపు కోసం చిన్న మూకుడులో నూనె వేడి చేయాలి.For the tempering, heat oil in a small pan over medium heat.
-
నూనె వేడెక్కాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి.Add mustard seeds and let them splutter.
-
ఆ తర్వాత జీలకర్ర, మినప్పప్పు, ఎండు మిరపకాయలు వేసి పప్పు ఎర్రగా అయ్యే వరకు వేయించాలి.Add cumin seeds, split black gram (urad dal), and dried red chilies, frying until the dal turns golden brown.
-
చివరగా కరివేపాకు, ఇంగువ వేసి స్టవ్ కట్టేయాలి.Finally, add the curry leaves and asafoetida, then turn off the heat.
-
ఈ తాలింపును పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి.Pour this aromatic tempering over the prepared chutney and mix well before serving.