మామిడికాయ బీరకాయ పచ్చడి

Mamidikaya Beerakaya Pachadi
పుల్లని మామిడి, తీయని బీరకాయల అద్భుత కలయిక!
A tangy and spicy fusion of Ridge Gourd and Raw Mango!

ఈ పచ్చడి మామిడికాయలోని పులుపు మరియు బీరకాయలోని మృదువైన తీపిని కలిపి చేసే ఒక అద్భుతమైన వంటకం. ఆంధ్ర ఇళ్ళలో వేసవి కాలంలో మామిడికాయలు విరివిగా దొరికినప్పుడు తప్పకుండా చేసుకునే పచ్చడి ఇది. మా చిన్నప్పుడు అమ్మమ్మ మధ్యాహ్నం పూట రోట్లో ఈ పచ్చడిని తాజాగా నూరి వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి పెడుతుంటే ఆ రుచి అద్భుతంగా ఉండేది.

This chutney is a delicious fusion of tangy raw mangoes and tender ridge gourd. It is a seasonal specialty in Andhra households, especially during the mango season. The combination of the tartness from the mango and the subtle sweetness of the gourd creates a balanced flavor profile that pairs exceptionally well with hot rice and ghee. My grandmother used to make this in a traditional stone mortar, which added an earthy depth to its vibrant flavor.

తయారి సమయం

15 minutes
వండే సమయం

15 minutes
పరిమాణం

4
కష్టం

Easy

కావలసిన పదార్ధాలు

  • బీరకాయ ముక్కలు Ridge Gourd pieces (peeled and chopped) 2 cups
  • పచ్చి మామిడికాయ ముక్కలు Raw Mango pieces (peeled and chopped) 1 cup
  • నూనె Oil (for frying and tempering) 2 teaspoons
  • పచ్చి మిరపకాయలు Green Chillies (adjust to spice preference) 10
  • జీలకర్ర Cumin Seeds (Jeera) 1 teaspoon
  • పసుపు Turmeric Powder (Pasupu) 1/2 teaspoon
  • ఆవాలు Mustard Seeds (Avalu) 1/2 teaspoon
  • ఇంగువ Asafoetida (Hing) 1/4 teaspoon
  • ఉప్పు Salt (as needed) 1 teaspoon
  • రెమ్మ కరివేపాకు Curry Leaves (Karivepaku) 1

తయారీ విధానం

  1. బీరకాయను శుభ్రంగా కడిగి, తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
    Wash the ridge gourd thoroughly, peel the skin, and cut it into small bite-sized pieces.
  2. మామిడికాయను కూడా శుభ్రంగా కడిగి, తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
    Wash and peel the raw mango, then chop it into small pieces similar to the ridge gourd.
  3. ఒక బాణలిలో రెండు టీస్పూన్ల నూనె వేడి చేసి, పచ్చిమిర్చి మరియు బీరకాయ ముక్కలను వేయించాలి.
    Heat two teaspoons of oil in a pan and sauté the green chillies and chopped ridge gourd pieces.
  4. బీరకాయ ముక్కలు మెత్తబడి పచ్చి వాసన పోయే వరకు వేయించి స్టవ్ ఆపి పూర్తిగా చల్లారనివ్వాలి.
    Cook until the ridge gourd becomes soft and the raw aroma disappears, then remove from heat and let it cool completely.
  5. ఒక మిక్సీ జార్‌లో వేయించిన బీరకాయ, పచ్చిమిర్చి, పచ్చి మామిడికాయ ముక్కలు, జీలకర్ర, పసుపు మరియు ఉప్పు వేయాలి.
    In a blender or mortar, combine the sautéed ridge gourd, green chillies, raw mango pieces, cumin seeds, turmeric powder, and salt.
  6. వీటిని మరీ మెత్తగా పేస్టులా కాకుండా రోటి పచ్చడి లాగా కొంచెం బరకగా రుబ్బుకోవాలి.
    Pulse the mixture into a coarse paste without adding any water to maintain a traditional, textured consistency.
  7. ఒక చిన్న బాణలిలో తాలింపు కోసం కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, ఇంగువ మరియు కరివేపాకు వేయాలి.
    For the tempering, heat a small amount of oil in a pan and add mustard seeds, asafoetida, and curry leaves.
  8. తాలింపు వేగాక దానిని సిద్ధం చేసుకున్న పచ్చడిలో కలిపి ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి.
    Once the mustard seeds begin to crackle, pour this tempering over the prepared chutney and mix well before serving.

మామిడికాయ బీరకాయ పచ్చడి

పుల్లని మామిడి, తీయని బీరకాయల అద్భుత కలయిక!

కావలసిన పదార్ధాలు
  • బీరకాయ ముక్కలు Ridge Gourd pieces (peeled and chopped) 2 cups
  • పచ్చి మామిడికాయ ముక్కలు Raw Mango pieces (peeled and chopped) 1 cup
  • నూనె Oil (for frying and tempering) 2 teaspoons
  • పచ్చి మిరపకాయలు Green Chillies (adjust to spice preference) 10
  • జీలకర్ర Cumin Seeds (Jeera) 1 teaspoon
  • పసుపు Turmeric Powder (Pasupu) 1/2 teaspoon
  • ఆవాలు Mustard Seeds (Avalu) 1/2 teaspoon
  • ఇంగువ Asafoetida (Hing) 1/4 teaspoon
  • ఉప్పు Salt (as needed) 1 teaspoon
  • రెమ్మ కరివేపాకు Curry Leaves (Karivepaku) 1
తయారి సమయం

15 minutes
వండే సమయం

15 minutes
పరిమాణం

4
కష్టం

Easy

ఈ పచ్చడి మామిడికాయలోని పులుపు మరియు బీరకాయలోని మృదువైన తీపిని కలిపి చేసే ఒక అద్భుతమైన వంటకం. ఆంధ్ర ఇళ్ళలో వేసవి కాలంలో మామిడికాయలు విరివిగా దొరికినప్పుడు తప్పకుండా చేసుకునే పచ్చడి ఇది. మా చిన్నప్పుడు అమ్మమ్మ మధ్యాహ్నం పూట రోట్లో ఈ పచ్చడిని తాజాగా నూరి వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి పెడుతుంటే ఆ రుచి అద్భుతంగా ఉండేది.

తయారి విధానం
  1. బీరకాయను శుభ్రంగా కడిగి, తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
    Wash the ridge gourd thoroughly, peel the skin, and cut it into small bite-sized pieces.
  2. మామిడికాయను కూడా శుభ్రంగా కడిగి, తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
    Wash and peel the raw mango, then chop it into small pieces similar to the ridge gourd.
  3. ఒక బాణలిలో రెండు టీస్పూన్ల నూనె వేడి చేసి, పచ్చిమిర్చి మరియు బీరకాయ ముక్కలను వేయించాలి.
    Heat two teaspoons of oil in a pan and sauté the green chillies and chopped ridge gourd pieces.
  4. బీరకాయ ముక్కలు మెత్తబడి పచ్చి వాసన పోయే వరకు వేయించి స్టవ్ ఆపి పూర్తిగా చల్లారనివ్వాలి.
    Cook until the ridge gourd becomes soft and the raw aroma disappears, then remove from heat and let it cool completely.
  5. ఒక మిక్సీ జార్‌లో వేయించిన బీరకాయ, పచ్చిమిర్చి, పచ్చి మామిడికాయ ముక్కలు, జీలకర్ర, పసుపు మరియు ఉప్పు వేయాలి.
    In a blender or mortar, combine the sautéed ridge gourd, green chillies, raw mango pieces, cumin seeds, turmeric powder, and salt.
  6. వీటిని మరీ మెత్తగా పేస్టులా కాకుండా రోటి పచ్చడి లాగా కొంచెం బరకగా రుబ్బుకోవాలి.
    Pulse the mixture into a coarse paste without adding any water to maintain a traditional, textured consistency.
  7. ఒక చిన్న బాణలిలో తాలింపు కోసం కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, ఇంగువ మరియు కరివేపాకు వేయాలి.
    For the tempering, heat a small amount of oil in a pan and add mustard seeds, asafoetida, and curry leaves.
  8. తాలింపు వేగాక దానిని సిద్ధం చేసుకున్న పచ్చడిలో కలిపి ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి.
    Once the mustard seeds begin to crackle, pour this tempering over the prepared chutney and mix well before serving.
[real3dflipbook id='1']