మామిడికాయ బీరకాయ పచ్చడి
Mamidikaya Beerakaya Pachadi
బీరకాయ తీపి మరియు మామిడి పులుపుల అద్భుత కలయిక
A perfect fusion of sweet ridge gourd and tangy raw mango
ఈ పచ్చడి ఆంధ్ర ప్రాంతంలో చాలా ప్రాచుర్యం పొందినది. వేసవి కాలంలో దొరికే పుల్లని మామిడికాయలు, తీయటి బీరకాయలతో కలిపి చేసే ఈ పచ్చడి భోజనంలో అమృతంలా ఉంటుంది. మా అమ్మమ్మ ఈ పచ్చడిని రోట్లో నూరేవారు, దాని రుచి ఎప్పటికీ మర్చిపోలేము.
This chutney is a classic staple in Andhra households, especially during the mango season. The natural sweetness of the ridge gourd perfectly balances the sharp tanginess of the raw mango. Growing up, this was a frequent summer accompaniment that transformed a simple meal into a feast.
తయారి సమయం
15 minutes
15 minutes
వండే సమయం
15 minutes
15 minutes
పరిమాణం
4
4
కష్టం
Easy
Easy
కావలసిన పదార్ధాలు
- బీరకాయ ముక్కలు Ridge Gourd Pieces (peeled and chopped) 2 cups
- మామిడికాయ ముక్కలు Raw Mango Pieces (peeled and chopped) 1/2 cup
- పచ్చిమిర్చి Green Chilies 8
- నూనె Oil 2 teaspoon
- జీలకర్ర Cumin Seeds 1 teaspoon
- ఆవాలు Mustard Seeds 1 teaspoon
- మినపప్పు Urad Dal 1 teaspoon
- వెల్లుల్లి రెబ్బలు Garlic Cloves 4
- ఉప్పు Salt (as per taste) 1/2 teaspoon
- పసుపు Turmeric Powder 1/4 teaspoon
- రెమ్మ కరివేపాకు Curry Leaves 1
- ఎండుమిర్చి Dried Red Chilies (for tempering) 2
తయారీ విధానం
-
ముందుగా బీరకాయను శుభ్రం చేసి, పైన ఉన్న పీచు తీసివేసి ముక్కలుగా కోసుకోవాలి.Wash the ridge gourd, peel the skin, and cut it into medium-sized pieces.
-
మామిడికాయను కూడా తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.Peel the raw mango and cut it into small cubes, discarding the stone.
-
ఒక బాణలిలో ఒక టీస్పూన్ నూనె వేసి వేడి అయ్యాక, పచ్చిమిర్చి మరియు జీలకర్ర వేసి దోరగా వేయించాలి.Heat one teaspoon of oil in a pan and sauté green chilies and cumin seeds until they are slightly charred.
-
అదే బాణలిలో బీరకాయ ముక్కలు మరియు కొద్దిగా ఉప్పు వేసి, ముక్కలు మెత్తబడే వరకు మూత పెట్టి ఉడికించాలి. ఉడికిన తర్వాత చల్లారనివ్వాలి.In the same pan, add the ridge gourd pieces with a pinch of salt. Cover and cook until they become soft. Let them cool completely.
-
మిక్సీ జార్‌లో లేదా రోట్లో ముందుగా వేయించిన పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు మరియు మామిడికాయ ముక్కలు వేసి మెత్తగా నూరుకోవాలి.In a blender or mortar and pestle, grind the sautéed green chilies, cumin, garlic cloves, and raw mango pieces into a coarse paste.
-
అందులోనే ఉడికించిన బీరకాయ ముక్కలను వేసి ఒక్కసారి తిప్పాలి. మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా ఉంటే రుచి బాగుంటుంది.Add the cooked ridge gourd pieces to the paste and pulse a few times. Ensure it remains slightly chunky for a better texture.
-
తాలింపు కోసం చిన్న బాణలిలో నూనె వేసి ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు మరియు పసుపు వేసి వేయించాలి.For the tempering, heat the remaining oil in a small pan. Add mustard seeds, urad dal, dried red chilies, turmeric, and curry leaves.
-
ఈ తాలింపును సిద్ధం చేసుకున్న పచ్చడిలో కలిపి వేడి వేడి అన్నంలో నెయ్యితో వడ్డించాలి.Once the seeds splutter and the dal turns golden brown, pour this tempering over the prepared chutney and mix well.