మిరియాల పొంగల్
Miriyala Pongal
కమ్మని నెయ్యి మరియు మిరియాల ఘాటుతో కూడిన ఆరోగ్యకరమైన అల్పాహారం.
A comforting South Indian breakfast infused with black pepper and golden ghee.
దక్షిణ భారతదేశంలోని దేవాలయాలలో ప్రసాదంగా పెట్టే ఈ పొంగల్ అంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా శీతాకాలంలో లేదా వర్షాకాలంలో వేడి వేడి పొంగల్ తింటే ఆ రుచే వేరు. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది.
Known as the quintessential comfort food in South Indian homes, Ven Pongal is often served as a divine offering in temples. Its creamy texture and peppery kick make it a morning favorite that is both nutritious and easy on the stomach.
తయారి సమయం
10 minutes
10 minutes
వండే సమయం
25 minutes
25 minutes
పరిమాణం
4
4
కష్టం
Easy
Easy
కావలసిన పదార్ధాలు
- బియ్యం Rice 1 cup
- పెసరపప్పు Moong Dal 1/2 cup
- నీళ్లు Water 4 cups
- మిరియాలు Black Peppercorns (slightly crushed) 1 teaspoon
- జీలకర్ర Cumin Seeds 1 teaspoon
- అల్లం Ginger (finely chopped) 1/2 inch
- నెయ్యి Ghee 2 tablespoons
- జీడిపప్పు Cashew Nuts 10
- కరివేపాకు Curry Leaves 1 sprig
- ఇంగువ Asafoetida (Hing) 1/4 teaspoon
- ఉప్పు Salt (or to taste) 1 teaspoon
తయారీ విధానం
-
బియ్యాన్ని మరియు పెసరపప్పును బాగా కడిగి నీటిని వడకట్టి పక్కన పెట్టుకోండి.Wash the rice and moong dal together thoroughly under running water and drain well.
-
ఒక ప్రెజర్ కుక్కర్‌లో కడిగిన బియ్యం, పెసరపప్పు మరియు నాలుగు కప్పుల నీళ్లు పోయండి.In a pressure cooker, add the washed rice, dal, and four cups of water.
-
దీనికి తగినంత ఉప్పు కలిపి కుక్కర్ మూత పెట్టి 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించండి.Add salt as per taste, close the lid, and pressure cook for 3 to 4 whistles until the mixture becomes soft and mushy.
-
ప్రెజర్ తగ్గిన తర్వాత మూత తీసి అన్నం మరియు పప్పు మిశ్రమాన్ని గరిటెతో బాగా మెదపండి.Once the pressure is released naturally, open the lid and mash the rice-dal mixture gently with a ladle.
-
ఒక చిన్న బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పులను దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోండి.In a small frying pan, heat the ghee and fry the cashew nuts until they turn a beautiful golden brown, then set them aside.
-
అదే నెయ్యిలో జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు, అల్లం ముక్కలు, ఇంగువ మరియు కరివేపాకు వేసి తాలింపు వేయండి.In the remaining ghee, add the cumin seeds, slightly crushed black peppercorns, chopped ginger, curry leaves, and asafoetida.
-
ఈ వేడి తాలింపును మరియు వేయించిన జీడిపప్పులను ఉడికించిన పొంగల్‌లో వేసి బాగా కలపండి.Sauté for a minute until the spices release their aroma and then pour this tempering over the cooked pongal.
-
చివరగా మరికొంచెం నెయ్యి వేసి వేడి వేడిగా వడ్డించండి.Mix everything well, garnish with the fried cashews, and serve hot with an extra dollop of ghee.