రాగి దోశ
Ragi Dosa
ఆరోగ్యకరమైన మరియు కరకరలాడే అల్పాహారం
A nutritious and crispy start to your day
రాగి లేదా చిరుధాన్యాలు శతాబ్దాలుగా దక్షిణ భారత ఇళ్లలో ప్రధాన ఆహారం. కాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా ఉండే ఈ ఇన్‌స్టంట్ రాగి దోశ, పులియబెట్టే అవసరం లేకుండానే త్వరగా చేసుకోవచ్చు. మా అమ్మమ్మ బిజీగా ఉన్న రోజుల్లో మాకు శక్తినివ్వడానికి ఈ దోశను తయారుచేసేవారు.
Ragi, also known as finger millet, has been a staple in South Indian households for centuries. Known for its high calcium and iron content, this instant version of the traditional dosa allows you to enjoy a healthy meal without the long fermentation process. My grandmother used to make this on busy mornings when we needed a boost of energy.
తయారి సమయం
10 mins
10 mins
వండే సమయం
15 mins
15 mins
పరిమాణం
4
4
కష్టం
Easy
Easy
కావలసిన పదార్ధాలు
- రాగి పిండి Ragi Flour (Finger Millet Flour) 1 cup
- బియ్యం పిండి Rice Flour (For crispiness) 1/2 cup
- బొంబాయి రవ్వ Semolina (Bombay Rava) 1/4 cup
- పెరుగు Curd (Fresh Yogurt) 1/2 cup
- నీళ్లు Water (Adjust for consistency) 2.5 cups
- జీలకర్ర Cumin Seeds 1 teaspoon
- అల్లం ముక్కలు Ginger Pieces (Finely chopped) 1 tablespoon
- పచ్చి మిరపకాయలు Green Chillies (Finely chopped) 2
- ఉల్లిపాయ ముక్కలు Onion Pieces (Finely chopped) 1/2 cup
- కొత్తిమీర Coriander Leaves (Finely chopped) 2 tablespoons
- ఉప్పు Salt (To taste) 1 teaspoon
- నూనె Cooking Oil (For roasting) 3 tablespoons
తయారీ విధానం
-
ఒక పెద్ద గిన్నెలో రాగి పిండి, బియ్యం పిండి మరియు బొంబాయి రవ్వను తీసుకోండి.In a large mixing bowl, combine ragi flour, rice flour, and semolina.
-
అందులో పెరుగు, ఉప్పు మరియు నీళ్లు పోసి ఉండలు లేకుండా విస్కర్ తో బాగా కలపండి. పిండి మజ్జిగలా పల్చగా ఉండాలి.Add curd, salt, and water. Whisk well to ensure there are no lumps. The batter should be thin, having a buttermilk-like consistency.
-
ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర మరియు కొత్తిమీర వేసి కలపండి.Add chopped onions, green chillies, ginger, cumin seeds, and coriander leaves. Mix well.
-
ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు పక్కన పెట్టండి. దీనివల్ల రవ్వ నీటిని పీల్చుకుని పిండి పర్ఫెక్ట్ గా తయారవుతుంది.Let the batter rest for 15 minutes to allow the semolina to absorb moisture.
-
స్టవ్ మీద నాన్-స్టిక్ పెనం వేడి చేసి, కొద్దిగా నూనె రాయండి.Heat a non-stick tawa or cast-iron griddle on medium-high heat and grease it lightly with oil.
-
దోశ వేసే ముందు పిండిని అడుగు నుండి బాగా కలపండి. గరిటెతో పిండిని తీసుకుని పెనం అంచు నుండి మధ్యలోకి పోయండి. సాధారణ దోశలాగా దీనిని పెనంపై రుద్దకూడదు.Stir the batter thoroughly from the bottom before pouring. Pour a ladleful of batter starting from the edges of the pan towards the center. Do not spread it with the ladle like a regular dosa.
-
దోశ అంచుల వెంట మరియు మధ్యలో కొద్దిగా నూనె వేయండి.Drizzle a teaspoon of oil around the edges and in the center holes.
-
మధ్యస్థ మంట మీద దోశ అంచులు ఎర్రగా, కరకరలాడే వరకు కాల్చండి. ఒకవైపు కాలిన తర్వాత కావాలంటే రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోవచ్చు.Cook on medium flame until the edges become crispy and turn golden brown.
-
వేడి వేడి రాగి దోశను కొబ్బరి చట్నీ లేదా అల్లం పచ్చడితో వడ్డించండి.Carefully lift the dosa. You can flip it for a few seconds if you prefer it extra cooked, or just fold and serve hot with coconut chutney or ginger pickle.