బెల్లం గవ్వలు
Sweet Jaggery Shells
నోరూరించే కరకరలాడే సాంప్రదాయ గవ్వలు
Traditional crunchy shells coated in golden jaggery syrup
గవ్వలు అంటే సముద్రపు గవ్వల ఆకారంలో ఉండే ఆంధ్రుల ప్రత్యేక పిండి వంటకం. పూర్వం మా అమ్మమ్మ గారు పండగ వస్తే చాలు చెక్క పీటపై వేగంగా గవ్వలు చుడుతుంటే ఆ ఆకారాలు చూసి మేము ఆశ్చర్యపోయేవాళ్ళం. ఈ తీపి జ్ఞాపకం ఇప్పుడు మీ కోసం.
Gavvalu, literally translating to ‘shells’, is a nostalgic snack from Andhra Pradesh. Traditionally made during festivals like Sankranti, these treats are shaped using a wooden grooved board. This recipe brings back the authentic taste of childhood snacks made with love by grandmothers.
తయారి సమయం
30 minutes
30 minutes
వండే సమయం
30 minutes
30 minutes
పరిమాణం
4 Servings (Approx. 30-40 shells)
4 Servings (Approx. 30-40 shells)
కష్టం
Medium
Medium
కావలసిన పదార్ధాలు
- మైదా పిండి All-purpose flour (Maida) 2 cups
- బొంబాయి రవ్వ Semolina (Bombay Rava) 1/2 cup
- నెయ్యి Ghee (Clarified Butter) 2 tablespoons
- ఉప్పు Salt 1 pinch
- బెల్లం Jaggery (Grated) 1 cup
- యాలకుల పొడి Cardamom Powder 1/2 teaspoon
- నీరు Water 1/4 cup
- నూనె Cooking Oil (for deep frying) 2 cups
తయారీ విధానం
-
ఒక మిక్సింగ్ గిన్నెలో మైదా పిండి, బొంబాయి రవ్వ, చిటికెడు ఉప్పు మరియు వేడి నెయ్యి వేసి బాగా కలపాలి.In a large mixing bowl, combine all-purpose flour, semolina, a pinch of salt, and hot ghee.
-
అవసరమైన నీటిని కొద్దికొద్దిగా పోస్తూ పిండిని గట్టిగా (పూరీ పిండిలా) కలుపుకోవాలి. ఈ పిండిని 15 నుండి 20 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.Gradually add water and knead it into a firm and stiff dough. Cover and let it rest for about 15 to 20 minutes.
-
పిండిని చిన్న చిన్న ఉండలుగా (గోళీ కాయల పరిమాణంలో) చేసుకోవాలి.Divide the rested dough into small, marble-sized balls.
-
గవ్వల పీటపై కొద్దిగా నూనె రాసి, ఒక ఉండను ఉంచి బొటనవేలితో ఒత్తుతూ ముందుకు దొర్లిస్తే గవ్వ ఆకారం వస్తుంది.Take a shell-making board (Gavvala Peeta) and grease it slightly with oil. Place a dough ball on the grooves and press it with your thumb while rolling it forward to get the shell shape.
-
బాండీలో నూనె వేడి చేసి, మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి గవ్వలను బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.Heat oil in a deep pan for frying. Once hot, maintain a medium flame and fry the shells until they turn golden brown and crispy. Remove and drain on paper towels.
-
వేరొక పాత్రలో బెల్లం తురుము మరియు నీరు పోసి కరిగించాలి.In a separate heavy-bottomed pan, combine grated jaggery and water. Heat until the jaggery dissolves completely.
-
బెల్లం నీటిని వడకట్టి మళ్ళీ ఉడికించాలి. అది తీగ పాకం (లేదా ఉండ పాకం) వచ్చే వరకు మరిగించాలి.Filter the jaggery liquid to remove impurities and boil it again until it reaches a soft-string consistency.
-
పాకం సిద్ధమయ్యాక యాలకుల పొడి వేసి మంట ఆపివేయాలి.Add cardamom powder to the syrup and turn off the heat.
-
వేయించిన గవ్వలను వెంటనే పాకంలో వేసి, పాకం మొత్తం గవ్వలకు పట్టేలా బాగా కలపాలి.Immediately add the fried shells into the warm jaggery syrup and toss gently until every shell is evenly coated.
-
గవ్వలు పూర్తిగా ఆరిన తర్వాత ఒక గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకోవాలి.Allow the shells to cool down completely until the syrup hardens before storing them in an airtight container.