మిర్చి బజ్జీ
Mirchi Bajji
కారం కారంగా, రుచికరంగా ఉండే ఆంధ్రా వీధి ఆహారం!
A spicy, crunchy, and irresistible South Indian street food classic!
మిర్చి బజ్జీ అనేది ఆంధ్రప్రదేశ్ వీధుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన స్నాక్. వర్షం పడుతున్నప్పుడు వేడివేడి మిర్చి బజ్జీలు, ఒక కప్పు టీతో తింటే ఆ మజాయే వేరు. ఈ రెసిపీలో చింతపండు మరియు వాము కలిపిన మసాలాను లోపల నింపడం వల్ల ప్రత్యేకమైన రుచి వస్తుంది.
Mirchi Bajji is an iconic street food in Andhra Pradesh and Telangana. These deep-fried chili fritters are famous for their spicy kick and the tangy tamarind stuffing that balances the heat. They are best enjoyed on a rainy evening with a cup of hot ginger tea.
తయారి సమయం
20 minutes
20 minutes
వండే సమయం
15 minutes
15 minutes
పరిమాణం
4 Persons
4 Persons
కష్టం
Medium
Medium
కావలసిన పదార్ధాలు
- పచ్చిమిర్చి Large Green Chilies (Bajji Mirchi) 10
- శనగపిండి Gram Flour (Besan) 1.5 cups
- బియ్యం పిండి Rice Flour 2 tablespoons
- పసుపు Turmeric Powder 1/2 teaspoon
- కారం Red Chili Powder 1 teaspoon
- వాము Carom Seeds (Ajwain) 1 teaspoon
- వంట సోడా Baking Soda 1/4 teaspoon
- ఉప్పు Salt (Adjust to taste) 1 teaspoon
- చింతపండు గుజ్జు Tamarind Pulp (For stuffing) 2 tablespoons
- జీలకర్ర పొడి Cumin Powder (For stuffing) 1 teaspoon
- తరిగిన ఉల్లిపాయలు Finely Chopped Onions (For garnish) 1/2 cup
- తరిగిన కొత్తిమీర Chopped Coriander Leaves (For garnish) 2 tablespoons
- నిమ్మరసం Lemon Juice 1 tablespoon
- వేయించడానికి నూనె Cooking Oil (For deep frying) 2 cups
తయారీ విధానం
-
మొదట మిర్చిలను శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. మధ్యలోకి పొడవుగా గాటు పెట్టి లోపల ఉన్న గింజలను తీసివేయాలి.Wash the large green chilies and pat them dry. Make a vertical slit in each chili and carefully remove the seeds to reduce the heat.
-
ఒక చిన్న గిన్నెలో చింతపండు గుజ్జు, కొంచెం వాము, జీలకర్ర పొడి మరియు కొద్దిగా ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిర్చిల లోపల కొద్దిగా పూయాలి.In a small bowl, mix the tamarind pulp, a pinch of salt, carom seeds, and cumin powder. Spread a little of this paste inside each slit chili.
-
ఒక వెడల్పాటి పాత్రలో శనగపిండి, బియ్యం పిండి, పసుపు, కారం, వాము, వంట సోడా మరియు ఉప్పు వేసి బాగా కలపాలి.In a large mixing bowl, combine gram flour, rice flour, turmeric powder, red chili powder, carom seeds, baking soda, and salt.
-
అందులో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని మందపాటి జారుడు మిశ్రమంలా (దోశ పిండి కంటే కొంచెం గట్టిగా) కలుపుకోవాలి. పిండిలో ఉండలు లేకుండా చూసుకోవాలి.Gradually add water and whisk to form a thick, smooth batter. The consistency should be thick enough to coat the chilies evenly without dripping off too quickly.
-
బాండీలో నూనె వేడి చేయాలి. నూనె బాగా కాగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి.Heat oil in a deep frying pan over medium heat. To check if the oil is ready, drop a small bit of batter; it should sizzle and rise to the surface immediately.
-
ఒక్కో మిర్చిని తీసుకుని పిండిలో ముంచి, మిర్చి అంతా పిండి సమానంగా అంటేలా చూసి మెల్లగా నూనెలో వేయాలి.Hold a chili by its stem, dip it into the batter until it is completely coated, and gently drop it into the hot oil.
-
బజ్జీలు బంగారు రంగులోకి మారి కరకరలాడే వరకు అన్ని వైపులా వేయించి, టిష్యూ పేపర్ మీదకు తీసుకోవాలి.Fry the bajjis on medium heat, turning occasionally, until they turn golden brown and crispy on all sides.
-
తర్వాత వేయించిన బజ్జీలను మధ్యలోకి కోసి, అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర మరియు నిమ్మరసం చల్లి వేడివేడిగా వడ్డించాలి.Remove the bajjis and drain them on paper towels. For a street-style finish, slit the fried bajjis, stuff them with chopped onions, coriander, and a squeeze of fresh lemon juice before serving.