దోసకాయ రోటి పచ్చడి
Dosakaya Roti Pachadi
నోరూరించే రుచి!
A tangy and crunchy treat!
దోసకాయ రోటి పచ్చడి ఆంధ్రుల ఇళ్లలో చాలా ప్రాచుర్యం పొందిన వంటకం. ముక్కలు కరకరలాడుతూ, కారంగా, పుల్లగా ఉండే ఈ పచ్చడి అమ్మమ్మల కాలం నాటి గొప్ప రుచిని గుర్తు చేస్తుంది. ఈ పచ్చడిని సాంప్రదాయకంగా రోట్లో నూరడం వల్ల దీనికి ప్రత్యేకమైన రుచి వస్తుంది.
Dosakaya Roti Pachadi is a quintessential Andhra condiment. Known for its unique combination of crunchy cucumber pieces and a spicy, tangy base, it brings back memories of grandmother’s kitchen. Traditionally made in a mortar and pestle (Rolu), this chutney preserves the texture of the cucumber perfectly.
తయారి సమయం
15 minutes
15 minutes
వండే సమయం
10 minutes
10 minutes
పరిమాణం
4 Servings
4 Servings
కష్టం
Easy
Easy
కావలసిన పదార్ధాలు
- దోసకాయ Yellow Cucumber (peeled, deseeded, and chopped into small cubes) 250 grams
- పచ్చి మిరపకాయలు Green Chilies (adjust to spice level) 8
- నూనె Oil 2 teaspoons
- ఆవాలు Mustard Seeds 1 teaspoon
- జీలకర్ర Cumin Seeds 1 teaspoon
- మెంతులు Fenugreek Seeds 1/4 teaspoon
- పసుపు Turmeric Powder 1/4 teaspoon
- ఇంగువ Asafoetida 1 pinch
- చింతపండు small lemon size Tamarind 1
- ఉప్పు Salt (as needed) 1 teaspoon
- కొత్తిమీర Coriander Leaves (chopped) 2 tablespoons
- కరివేపాకు Curry Leaves 1 sprig
- మిరపకాయలు Dried Red Chilies 2 ఎండు
తయారీ విధానం
-
ముందుగా దోసకాయను కడిగి, తొక్క తీసి, లోపల గింజలు తొలగించి చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి.Wash the yellow cucumber, peel the skin, remove the seeds, and chop it into very small cubes. Keep them aside.
-
ఒక బాండీలో ఒక టీస్పూన్ నూనె వేడి చేసి, పచ్చి మిరపకాయలు, సగం జీలకర్ర, మెంతులు వేసి వేయించి పక్కన తీసి చల్లార్చండి.Heat one teaspoon of oil in a pan and fry the green chilies, half of the cumin seeds, and fenugreek seeds until aromatic. Let them cool.
-
రోట్లో లేదా మిక్సీలో వేయించిన పచ్చి మిరపకాయలు, జీలకర్ర, మెంతులు, చింతపండు, ఉప్పు వేసి మెత్తగా నూరండి.In a mortar and pestle or a blender, grind the fried chilies, cumin, fenugreek, tamarind, and salt into a coarse paste.
-
ఇప్పుడు అందులో సగం దోసకాయ ముక్కలు వేసి కచ్చాపచ్చాగా నూరండి.Add half of the chopped cucumber pieces to this paste and crush them slightly so they blend with the spices.
-
మిగిలిన దోసకాయ ముక్కలు, కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపి ఒక గిన్నెలోకి తీసుకోండి. ముక్కలు మరీ మెత్తగా అవ్వకూడదు.Add the remaining cucumber pieces and chopped coriander leaves. Mix gently without mashing the second batch of cubes to maintain crunchiness.
-
తాలింపు కోసం చిన్న బాండీలో మిగిలిన నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి వేయించండి.For tempering, heat the remaining oil in a small pan. Add mustard seeds, remaining cumin, dried red chilies, curry leaves, asafoetida, and turmeric powder.
-
ఈ తాలింపును సిద్ధం చేసుకున్న పచ్చడిలో వేసి బాగా కలిపితే ఎంతో రుచికరమైన దోసకాయ రోటి పచ్చడి సిద్ధం.Pour this tempering over the prepared chutney and mix well. Serve with hot rice and ghee.