మామిడికాయ పప్పు
Mamidikaya Pappu
పుల్లపుల్లగా, కమ్మగా ఉండే అసలైన మామిడికాయ పప్పు!
A tangy and comforting hug in a bowl of lentils!
తెలుగువారి వేసవి కాలం మామిడికాయ పప్పు లేకుండా పూర్తి కాదు. కందిపప్పు కమ్మదనం, పచ్చి మామిడికాయ పులుపు కలిసి అద్భుతమైన రుచిని ఇస్తాయి. చిన్నప్పుడు మామ్మగారి ఇంట్లో తిన్న ఆ కమ్మని రుచిని గుర్తుకు తెచ్చే సంప్రదాయ వంటకం ఇది.
This classic Andhra dal is a summer staple in every Telugu household. The combination of sour raw mangoes and creamy pigeon peas creates a symphony of flavors. It is a nostalgic dish that reminds many of their childhood summers spent at their grandmother’s house, where the aroma of the fresh mango tempering filled the air.
తయారి సమయం
15 minutes
15 minutes
వండే సమయం
25 minutes
25 minutes
పరిమాణం
4
4
కష్టం
Easy
Easy
కావలసిన పదార్ధాలు
- కందిపప్పు Toor Dal (Pigeon Peas) 1 cup
- పచ్చి మామిడికాయ ముక్కలు Raw Mango pieces (peeled and chopped) 1 cup
- పచ్చి మిర్చి Green Chilies (slit) 3
- పసుపు Turmeric powder 1/2 teaspoon
- నీళ్లు Water 2.5 cups
- నూనె Oil (or Ghee) 2 teaspoons
- ఆవాలు Mustard seeds 1/2 teaspoon
- జీలకర్ర Cumin seeds 1/2 teaspoon
- ఎండు మిర్చి Dried Red Chilies 2
- ఇంగువ Asafoetida (Hing) 1/4 teaspoon
- వెల్లుల్లి రెబ్బలు Garlic cloves (crushed) 4
- కరివేపాకు Curry leaves 1 sprig
తయారీ విధానం
-
కందిపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి, దానికి మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు మరియు నీళ్లు కలపాలి.Wash the toor dal thoroughly and add it to a pressure cooker along with the raw mango pieces, slit green chilies, turmeric powder, and water.
-
కుక్కర్ మూత పెట్టి మధ్యస్థ మంట మీద 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.Close the lid and pressure cook on medium heat for 3 to 4 whistles until the lentils are soft and well-cooked.
-
ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి, పప్పుగుత్తితో పప్పును మెత్తగా ఎనిపి సరిపడా ఉప్పు కలపాలి.Once the pressure is naturally released, open the lid and mash the dal gently with a wooden masher, then stir in the salt.
-
తాలింపు కోసం ఒక చిన్న పాన్ లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు మరియు ఇంగువ వేసి వేయించాలి.For the tempering, heat oil or ghee in a small pan and add mustard seeds, cumin seeds, dried red chilies, crushed garlic, curry leaves, and asafoetida.
-
వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఈ తాలింపును ఉడికించిన పప్పులో వేసి బాగా కలిపి వేడివేడిగా వడ్డించాలి.Wait until the garlic turns golden brown and the seeds splutter, then pour this aromatic tempering over the cooked dal and mix well. Serve hot.