వంగీ బాత్
Vangi Bath
వంకాయల సువాసనతో నిండిన సంప్రదాయ వంటకం
The Ultimate Traditional South Indian Brinjal Rice
వంగీ బాత్ అనేది దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా కర్ణాటకలో ఎంతో ప్రాచుర్యం పొందిన బియ్యం వంటకం. వంకాయ ముక్కలను ప్రత్యేకమైన మసాలా పొడి మరియు చింతపండుతో కలిపి వండటం వల్ల దీనికి విలక్షణమైన రుచి వస్తుంది. ఇది లంచ్ బాక్స్ కోసం కూడా సరైన ఎంపిక.
Vangi Bath is a legendary rice preparation from the heart of Karnataka. The dish gets its name from ‘Vangi’ (Brinjal) and ‘Bath’ (Rice dish). The secret lies in the ‘Vangi Bath Powder’, a blend of spices that creates a symphony of flavors when combined with tender brinjals and tangy tamarind.
తయారి సమయం
15 minutes
15 minutes
వండే సమయం
25 minutes
25 minutes
పరిమాణం
2
2
కష్టం
Medium
Medium
కావలసిన పదార్ధాలు
- బియ్యం Rice (cooked and cooled) 1 cup
- వంకాయలు Brinjal (thinly sliced) 250 grams
- నూనె Cooking Oil 2 tablespoons
- ఆవాలు Mustard Seeds 1/2 teaspoon
- మినపప్పు Urad Dal 1/2 teaspoon
- శనగపప్పు Chana Dal 1/2 teaspoon
- పసుపు Turmeric Powder 1/4 teaspoon
- వంగీ బాత్ పొడి Vangi Bath Powder 2 tablespoons
- చింతపండు గుజ్జు Tamarind Pulp 1 tablespoon
- పల్లీలు Peanuts 1 tablespoon
- కరివేపాకు Curry Leaves 1 sprig
- ఉప్పు Salt (as per taste) 1/2 teaspoon
- కొత్తిమీర Coriander Leaves (chopped) 1 tablespoon
తయారీ విధానం
-
ముందుగా అన్నం వండుకుని ఒక వెడల్పాటి ప్లేట్ లో వేసి చల్లార్చుకోవాలి. అన్నం పొడిపొడిగా ఉండేలా చూసుకోవాలి.Begin by cooking the rice and spreading it on a wide plate to cool. Ensure the grains are separate and not mushy.
-
ఒక పాన్ లో నూనె వేడి చేసి ఆవాలు, మినపప్పు, శనగపప్పు మరియు పల్లీలు వేసి దోరగా వేయించాలి.Heat oil in a large pan or kadai. Add mustard seeds, urad dal, chana dal, and peanuts, frying until they turn golden brown.
-
అందులోనే కరివేపాకు మరియు సన్నగా పొడవుగా కోసిన వంకాయ ముక్కలను వేయాలి.Add the curry leaves and the thinly sliced brinjal pieces to the pan.
-
వంకాయ ముక్కలు మెత్తబడే వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి.Cover and sauté on a medium flame until the brinjals become soft and tender.
-
ముక్కలు మగ్గిన తర్వాత అందులో పసుపు, ఉప్పు మరియు వంగీ బాత్ పొడి వేసి బాగా కలపాలి.Add turmeric powder, salt, and the signature Vangi Bath powder. Mix well to coat the brinjals uniformly.
-
ఇప్పుడు చింతపండు గుజ్జును కూడా వేసి నూనె పైకి తేలే వరకు సుమారు రెండు నిమిషాలు ఉడికించాలి.Pour in the tamarind pulp and cook for about two minutes until the moisture reduces and oil starts to separate from the masala.
-
చివరగా ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని వేసి మసాలా అంతా అన్నానికి పట్టేలా జాగ్రత్తగా కలపాలి.Gently fold in the cooled rice, ensuring every grain is coated with the spicy brinjal mixture without breaking the rice grains.
-
కొత్తిమీర చల్లుకుని వేడివేడిగా వడ్డించాలి.Garnish with freshly chopped coriander leaves and serve hot.