Chandraharam
ఈ సినిమా గురించీ...
ఈ సినిమాలో ప్రత్యేకంగా...
సినిమాలో పాటలు...
మీకు తెలుసా?
తారాగణం
మార్కస్ బార్ట్లే ఛాయాగ్రహణం, మాధవపెద్ది గోఖలే కళాదర్శకత్వంలో రూపుదిద్దుకున్న యక్షలోకపు దృశ్యాలు నేటికీ సినిమాటోగ్రఫీ విద్యార్థులకు పాఠ్యాంశాలు.
The visual grandeur of the Yakshaloka, shaped by Marcus Bartley's cinematography and Madhavapeddi Gokhale's art direction, remains a textbook example for film students.
యక్షకన్య చంచలగా సావిత్రి గారి నృత్యాలు, అభినయం, మరియు కళ్లలో పలికించిన రౌద్రం ఈ చిత్రానికే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
Savitri's dances, expressions, and the fierce anger conveyed through her eyes as the Yakshini Chanchala stood as the film's major highlight.
ఘంటసాల సంగీత సారథ్యంలో రూపొందిన గీతాలు, ముఖ్యంగా ఆయన తన స్వర మాధుర్యంతో జానపద వాతావరణానికి ప్రాణం పోసిన తీరు అపూర్వం.
The songs composed by Ghantasala, and the way his mellifluous voice breathed life into the folklore ambiance, is purely unparalleled.
పింగళి నాగేంద్రరావు గారి మాటల పొందిక, ఆయన రాసిన పాటల వెనుక ఉన్న కవిత్వం ఈ జానపద చిత్రానికి ఒక కావ్య గౌరవాన్ని ఆపాదించాయి.
Pingali Nagendra Rao's eloquent dialogues and the poetry behind his lyrics bestowed an epic, literary dignity upon this folklore film.
ఎవరివో ఎచటనుంటివో ఓ సఖి
ప్రియురాలి అన్వేషణలో ఉన్న నాయకుడి విరహ వేదనను, ఘంటసాల తన మధురమైన గొంతులో అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ గీతం అనాటి యువత గుండెల్లో ఒక తీయని జ్ఞాపకంగా నిలిచిపోయింది.
Ghantasala's melodious voice perfectly captures the hero's yearning for his unseen beloved, making it a sweet, nostalgic memory for the youth of that era.
ఇది నా చెలి ఇది నా సఖి
తన కలల రాకుమారి ప్రతిమను చూసుకుంటూ నాయకుడు పాడే ఈ పాటలో, ఎన్.టి.ఆర్ అభినయం మరియు పింగళి వారి సాహిత్యపు లోతు శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తాయి.
As the hero sings to the portrait of his dream girl, NTR's expressive acting combined with Pingali's profound lyrics leaves the audience spellbound.
విజ్ఞాన దీపమును వెలిగింప రారయ్య
ఒకవైపు హాస్యం, మరోవైపు లోతైన తాత్వికత కలగలిసిన ఈ గీతం వినడానికి ఎంతో ఇంపుగా ఉంటుంది. ఈ పాటకు సంబంధించిన దృశ్యచిత్రణ విశేషంగా ఆకట్టుకుంటుంది.
A seamless blend of humor and deep philosophy, this song is exceptionally pleasant to hear and features a highly engaging visual narrative.
ఏమి శిక్ష కావాలో కోరుకొనవే
కోపంలో ఉన్న రాజు రాజసం, అందులో దాగున్న ఆవేదన ఈ పాటలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఘంటసాల గాన గంభీర్యానికి ఇది ఒక చక్కని ఉదాహరణ.
The regal fury and underlying anguish of the king are palpable in this track, standing as a fine testament to Ghantasala's majestic vocal prowess.
అపారమైన సాహిత్య స్పృశ ఉన్న కమలాకర కామేశ్వరరావు గారికి దర్శకుడిగా ఇదే తొలి చిత్రం.
This film marked the directorial debut of Kamalakara Kameswara Rao, a man known for his profound literary taste.
సహజంగా కరుణరస పాత్రల్లో, నిరాడంబరమైన వస్త్రధారణతో మెప్పించే మహాటి సావిత్రి గారు, ఈ చిత్రంలో పగబట్టిన యక్షకన్యగా నటించి అందరినీ విస్మయపరిచారు.
Mahanati Savitri, usually known for her tragic and demure roles, surprised everyone by playing a vengeful Yakshini with vampish shades.
చక్రపాణి గారి మూలకథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం, తెలుగు మరియు తమిళ భాషలలో ఏకకాలంలో నిర్మితమైంది.
Based on Aluri Chakrapani's original story, the film was shot simultaneously in Telugu and Tamil.
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించినప్పటికీ, కథానాయకుడు ఎక్కువ భాగం నిద్రావస్థలో ఉండటం వల్ల, నాటి ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించలేకపోయారు. అయినప్పటికీ ఇది ఒక కళాఖండంగా మిగిలిపోయింది.
Despite being a grand production, the film failed at the box office because the hero remains unconscious for a large part of the story. Nevertheless, it remains a cinematic masterpiece.
ఎన్. టి. రామారావు చందన రాజు పాత్రలో
N. T. Rama Rao as Prince Chandan
సావిత్రి చంచల పాత్రలో
Savitri as Chanchala
శ్రీరంజని (జూనియర్) గౌరి పాత్రలో
Sriranjani Jr. as Gauri
ఎస్. వి. రంగారావు మాళి పాత్రలో
S. V. Ranga Rao as Maali
రేలంగి ధూమకేతు పాత్రలో
Relangi as Dhumaketu