మెగా బ్రదర్స్ కు కొత్త చిక్కులు !
జిల్లాల విభజన ఆంధ్రప్రదేశ్ లో కొత్త వివాదాలకు కారణమవుతోంది. చాలా ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. బోలెడు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కొత్త జిల్లాల ఏర్పాటు నుంచి ప్రభుత్వం వెనక్కు తగ్గాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు తమ ప్రాంతాన్ని జిల్లా చేయాలని డిమాండ్ చేస్తే.. ఇంకొందరు తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి కోరుతున్నారు. జిల్లాల పేర్లపై మండిపడుతూ నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. తాజాగా జిల్లాల విభజన సెగ మెగా బ్రదర్స్‌ను తాకింది. వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది….